రామ్ చరణ్ ఈ ఏడాది ఎందుకు వదిలేశాడబ్బా
- December 26, 2017 / 01:05 PM ISTByFilmy Focus
2016 చివర్లో ‘ధృవ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ ఆ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఖైదీ నం.150’ నిర్మించడం, ఆ సినిమాని ప్రమోట్ చేయడం అనంతరం సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం” కోసం గెడ్డం పెంచడం కోసం ఇంకాస్త సమయం వెచ్చించడం, ఆ తర్వాత చిరంజీవి మరో చిత్రం “సైరా నరసింహా రెడ్డి” ప్రీప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయిపోవడంతో 2017లో రామ్ చరణ్ సినిమా ఒక్కటీ రాలేదు. బాలకృష్ణ, ఎన్టీయార్ వంటి సీనియర్ అండ్ యంగ్ హీరోస్ అందరూ ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న తరుణంలో రామ్ చరణ్ ఏడాది మొత్తం కనీసం ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా 2017లో హీరోగా తన అభిమానులను నిరాశపరిచిన రామ్ చరణ్ వచ్చే ఏడాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు సినిమాలు రిలీజ్ చేయనున్నాడని వినికిడి.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రంగస్థలం” మార్చి 28న విడుదలవుతుండగా.. బోయపాటి దర్శకత్వంలో త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్న మాస్ మసాలా ఎంటర్ టైనర్ దసరా విడుదలకు సన్నద్ధమవుతోంది. సో 2017లో మిస్ అయిన సక్సెస్ రేట్ ను 2018లో ఫుల్ ఫిల్ చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే “సైరా నరసింహారెడ్డి” కూడా కుదిరితే 2018లో రిలీజయ్యే అవకాశం ఉంది కాబట్టి 2018లో రామ్ చరణ్ హీరోగా, ప్రొడ్యూసర్ గా దూసుకుపోయే అవకాశం ఉంది.
















