తెలుగు సినిమాలో బుర్రా సాయిమాధవ్ (Sai Madhav Burra) అంటే ఇప్పుడు ఓ బ్రాండ్. ఎలాంటి సినిమాకైనా తన డైలాగ్‌లతో కొత్త రంగు అద్ది మెరిపించగల రచయితగా అనతికాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఆయన మాటలు రాస్తున్నారంటే… ఓ మంచి స్ఫూర్తి వినిపిస్తుంది అనేవారు. అలా అర్థవంతమైన సాహిత్యం కూడా ఆశించొచ్చు అనేవారు. అందుకే కొద్ది రోజుల్లో అగ్ర హీరోలు, దర్శకులతో పని చేసే అవకాశం దక్కించుకున్నారు. అలా వచ్చిన సినిమాలతో అలరించారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాల్ని మధ్యలోనే వదిలేస్తున్నారు.
చిరంజీవి (Megastar Chiranjeevi) – వశిష్ట మల్లిడి (Vassishtha) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం (Vishwambhara) ‘విశ్వంభర’. త్రిష (Trisha) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్ నుండి ఓ వార్త బయటకు వచ్చింది. అదే ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్న బుర్రా సాయిమాధవ్ తప్పుకొన్నారు. ఆయన స్థానంలో మరో రచయిత టీమ్‌లో చేరారట. కొన్ని సన్నివేశాల్ని బుర్రా సాయిమాధవ్ రాసినప్పటికీ… ఎందుకో కానీ తప్పుకున్నారు.
దీంతో బుర్రా సాయిమాధవ్ ఎందుకిలా సినిమాల నుండి తప్పుకుంటున్నారు అనే ప్రశ్న మొదలైంది. ఆ మధ్య పవన్ కల్యాణ్ (Pawan Kalyan) – సాయి దుర్గ తేజ్ (Sai Dharam Tej) సినిమా ‘బ్రో’ (BRO) నుండి కూడా ఇలానే మధ్యలో తప్పుకున్నారు. ఇప్పుడు ‘విశ్వంభర’ నుండి కూడా సైడ్ అయిపోయారు. (Mahesh Babu) మహేష్‌బాబు – రాజమౌళి (SS Rajamouli) సినిమాకు బుర్రానే డైలాగ్‌లు రాస్తారని వార్తలొచ్చాయి. కానీ అక్కడ కూడా లేదరు. ప్రస్తుతం ఆయన చేతిలో పెద్ద సినిమా అంటే (Kalki 2898 AD) ‘కల్కి 2898 ఏడీ’ మాత్రమే ఉంది.
దీంతో ఎందుకు పెద్ద సినిమాల నుండి ఆయన బయటకు వచ్చేస్తున్నారు. ఎక్కడ తేడా కొడుతోంది అనే ప్రశ్న వినిపిస్తుంది. అయితే ఆయన ఈటీవీ విన్‌తో కలసి నిర్మాణంలోకి వచ్చారు. ఆ పనులు చూసుకోవడం, వాటికి కథలు ఇవ్వడం.. శిష్యులతో వాటిని తెరకెక్కించడం లాంటి పనుల ఒత్తిడి వల్ల సినిమాల నుండి తప్పుకుంటున్నారని అంటున్నారు. మరి అసలు విషయం ఏంటో ఆయనే చెప్పాలి.