థియేటర్లలో ‘సలార్’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. దానికి ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఓ కారణమైతే… ప్రశాంత్ నీల్ గ్రాండ్ విజువల్స్ మరో కారణం అంటూ ఓ లెక్క ఉంది. అయితే ఇప్పుడు ఓటీటీలో కూడా సినిమా భారీ విజయం అందుకుంది అంటున్నారు. ఈ సినిమాను ఓటీటీలో పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని ఓ చర్చ మొదలైంది. అంటే అంతలా ఎందుకు చూస్తున్నారు, థియేటర్లలో చూసేశారు కదా అనేది ఆ చర్చ.
అయితే, ఈ చర్చకు ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి. అవే ఈ సినిమా నరేషన్, థియేటర్లలో నచ్చిన సన్నివేశాలు. నిజానికి ‘సలార్’ సినిమాను థియేటర్లలో చూస్తేనే ఆ గ్రాండియర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ప్రభాస్ లాంటి కటౌట్, సినిమా కోసం వేసిన సెట్స్, చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ రెగ్యులర్ సినిమాకు ఈ సినిమా ఎందుకు భిన్నం, ఎంత భిన్నం అనేది చెబుతాయి. గతంలో ఇలాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేసి ఓటలీటీలోకి వచ్చాక ఆ స్థాయిలో రిసెప్షన్ అందుకోలేదు అని చెప్పాలి.
కానీ, ఇప్పుడు ‘సలార్’ మాత్రం ఆ సినిమాల తరహాలో కాకుండా ఓటీటీలో కూడా ఆదరణ పొందుతోంది అని చెబుతున్నారు. దీనికి కారణం సినిమాలోని కాస్త కన్ఫ్యూజన్ నెరేషన్ అని అంటున్నారు. చాలా తెగల పేర్లు,మనుషుల పేర్లు, ప్రాంతాల పేర్లు, వాళ్ల గతాలు, ప్రస్తుతాలు ఇలా అన్నీ కలిపి సినిమా ప్రేక్షకుడి మెదడులో చేరిపోతాయి. థియేటర్‌లో ఆ ఫ్లోలో చూసేసిన వాళ్లు ఇప్పుడు డీప్‌గా చూస్తున్నారు అని అంటున్నారు. మరొకటి నచ్చిన సీన్స్ రిపీట్ కూడా ఓ కారణం అంటున్నారు.
మరోవైపు సినిమాలోని ఇన్నర్ డీటైల్స్ చాలానే ఉన్నాయి. సినిమా (Salaar) తొలిసారి చూసినప్పుడు వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోయినా… ఇప్పుడు సినిమా వచ్చి ఇన్నాళ్లు అయ్యాక వాటి మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో ఆ ప్రశ్నలకు, పాయింట్లకు సమాధానాలు వెతికే క్రమంలో చూస్తున్నారట. ఏదైతే ఏముంది సినిమాకైతే మంచి స్పందన వస్తోంది.