Samantha: బాలీవుడ్‌కి బాగా దగ్గరవుతున్న సమంత

హీరోయిన్లు వాళ్ల టీమ్‌నే కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు అని అంటుంటారు. హీరోయిన్‌గా మారాక కుటుంబ సభ్యులకంటే వాళ్లతోనే ఎక్కువ సమయం గడుపుతా ఉంటారు. అందుకే వాళ్లను మరో కుటుంబం అని అంటుంటారు. హీరోయిన్లే కాదు హీరోలు కూడా అంతే. అయితే ఇలాంటి కుటుంబంలో మార్పులు చేస్తోంది సమంత. అవును సమంత తన పీఆర్‌ టీమ్‌, మేనేజర్‌, పర్సనల్‌ టీమ్‌లో మార్పులు చేస్తోందట. సమంత టాలీవుడ్‌లో ప్రవేశించినప్పటి నుండి ఆమె మేనేజర్‌గా మహేంద్ర అనే వ్యక్తి ఉండేవారు.

Click Here To Watch NOW

అయితే ఏమైందో ఏమో కానీ కొన్ని రోజుల క్రితం ఆయనను తప్పించేసింది సామ్‌. ఇప్పుడు మరికొంతమంది టీమ్‌కి జీతాలు సెటిల్‌ చేసేసిందని అంటున్నారు. వారిలో మేకప్‌ ఈమ్‌, డ్రైవర్లు ఉన్నారని టాక్‌. ఇందులో నిజానిజాలు ఎంత అనేది తెలియదు కానీ… కొంతమంది కొత్త వాళ్లను అయితే హైర్‌ చేసుకుంటోందని అంటున్నారు. తొలుత మేనేజర్‌ మ‌హేంద్ర స్థానంలో ముంబయికి చెందిన ఓ మేనేజ‌ర్‌ని నియ‌మించుకుందని టాక్‌. ఇప్పుడు పర్సనల్‌ టీమ్‌లో కూడా ఇలాంటి మార్పులే జరిగాయట.

ముంబయికి చెందిన మరో టీమ్‌ వచ్చారట. దీంతో అసలు సమంత ఇలాంటి మార్పులు ఎందుకు చేస్తోంది అనే ప్రశ్న మొదలైంది. అయితే దీనికి సమాధానం… ఆమె బాలీవుడ్‌ ప్రయత్నాలే అని తెలుస్తోంది. బాలీవుడ్‌లో జెండా పాతాలని అనుకుంటున్న సామ్‌.. ఈ మేరకు మార్పులు చేసిందంటున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో ఇప్పటికే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత… ఫుల్‌ప్లెడ్జ్‌ హిందీ సినిమాలో నటించాలని చూస్తోంది. దీని కోసం సరైన వేదిక సెట్‌ చేసుకుంటోంది.

ఈ క్రమంలో బాలీవుడ్‌లో మరో వెబ్‌ సిరీస్‌ పట్టేసిందని సమాచారం. దీని కోసం ఆ మధ్య ముంబయి వెళ్లినప్పుడు మీడియా చుట్టుముడితే వరుణ్‌ ధావన్‌ వచ్చి ఆమెను బయటకు తీసుకొచ్చి కారు ఎక్కించిన విషయం తెలిసిందే. నాగచైతన్య నుండి దూరమయ్యాక సమంత ఆలోచనలు మారాయి. కెరీర్‌ విషయంలో ఆ మధ్య కాస్త నిరాసక్తతతో కనిపించిన సమంత… ఇప్పుడు ఇతర పరిశ్రమలకు వెళ్లి మరీ నాయికగా నిరూపించుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే వ్యక్తిగత సిబ్బంది, పీఆర్‌ సిబ్బందిలో మార్పులు అని సమాచారం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus