అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఎగతాళి చేయకూడదు. ఇది ఎవరైనా చెప్పే మాట, అందరూ ఆచరించే మాట కూడా. ఎందుకంటే మానవత్వం అనే కోణంలో ఆలోచించి ఈ మాట అంటారు. ఇది నిజం కూడా. అయితే దీనిని బేస్ చేసుకొని ఏం కాకపోయినా, పెద్ద విషయం కాకపోయినా ఏదో అయిపోయింది అని అంటే.. కచ్చితంగా వాళ్లను క్షమించకూడదు. అలాగే ప్రచారానికి ఇలాంటి పనులు చేసేవారిని చూసి.. నిజంగా ఏదైనా జరిగితే జోక్ అనుకునే అవకాశం ఉందని కూడా గుర్తించాలి.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూసిన తర్వాత ఓ విషయంలో నెటిజన్లు రియాక్ట్ అవుతున్న విధానం, అసలు అక్కడ జరిగింది ఏంటి అనే విషయం ఆలోచిస్తే అనిపించిన మాటలు ఇవి. కొన్ని రోజుల క్రితం ‘నాకు గాయాలయ్యాయి’ అంటూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో నిజంగానే ఆమె చేతికి గాయాలయ్యాయి. అయితే అవి బాక్సింగ్ ప్రాక్టీస్ వల్లనో లేక యాక్షన్ సీక్వెన్స్ వల్లనో తగిలిన చిన్నపాటి గాయాలు. ఇంకా చెప్పాలంటే చేతికి గీసుకున్నాయి.
అయితే ఆ పోస్టు కింద కొంతమంది ‘అవి గాయాలు కాదు ఆభరణాలు’ కామెంట్ చేయడంతో ఆమె నమస్కారం పెట్టింది. అయితే నిజంగా ఇలాంటి గాయలు స్టంట్స్ చేసే హీరోయిన్లకు తగలలేదా అంటే తగిలాయి అనే చెప్పాలి. కానీ ఇంతలా సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి.. తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోంది. కానీ ఆ పోస్టు కింద కామెంట్లు చూస్తే.. నిజంగానే గాయాలయ్యాయా? లేదా అనే డౌట్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. దీనికి కారణం కూడా సమంతనే.
ఓవైపు అనారోగ్యంతో ఉన్నాను, కాలు తీసి కాలు వేయలేను అని చెప్పిన కొద్ది రోజులకే జిమ్‌లో కనిపించింది. మరోసారి ఓ వ్యక్తి సాయంతో ‘శాకుంతలం’ ప్రెస్ మీట్‌కి నడుచుకుంటూ వచ్చిన సామ్.. అక్కడికి ఒకట్రెండు రోజులకే ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో చకచకా నడిచేసింది. దీంతో సమంత చెప్పేది, చేసేది ఒకేలా కనిపించడం లేదు. ఈ కారణాలతోనే కొంతమంది విమర్శకులు, విశ్లేషకులు, నెటిజన్లు సామ్ చేసేది కరెక్ట్ కాదు అంటున్నారు. స్కూలుకి వెళ్లే పిల్లల్లా ఇలాంటి కారణాలు చెబితే నవ్వులపాలవుతారు అంటున్నారు. మరి దీనికి సామ్ ఏమైనా సమాధానం చెబుతుందేమో చూడాలి.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!