‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా నుండి ‘దబిడి దిబిడి’ అనే పాట ఒకటి వచ్చింది. మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్‌లో వినే ఉంటారు. యూట్యూబ్‌లో చూసే ఉంటారు. మాకు ఈ తెలిసి పాటను అక్కడ కంటే ట్విటర్‌లో బిట్ బిట్ వీడియోలే ఎక్కువ మంది ఎక్స్‌లోనే చూసి ఉంటారు. ఎందుకంటే ఆ పాట రిలీజ్ అయింది పాపం.. వెంటవెంటనే ముక్కలు కొట్టేసి ఎక్స్‌లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆ ట్రోలింగ్‌కి కారణం బాలకృష్ణనో (Nandamuri Balakrishna) , ఊర్వశి రౌటేలానో కాదు. ఆ పాట కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Shekar Master).
Shekar Master
అవును, టాలీవుడ్‌లో అగ్ర డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ వల్లనే ఆ పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది, ట్రోలింగ్‌లోనూ ఉంది. ఆయన ఇచ్చిన స్టెప్పులే కారణం అయినా.. వాటి గొప్పతనం గురించి మాట్లాడుతూ ఎవరూ ట్రెండ్ చేయడం లేదు. బాలకృష్ణ, ఊర్వశికి ఆయన ఇచ్చిన స్టెప్పులు, మూమెంట్లు అభ్యంతరకరంగా ఉన్నాయి అనేది నెటిజన్ల మాట. ఎవరు చూసినా అదే మాట అంటారు కూడా.
పాటలో శేఖర్ మాస్టర్ ఇచ్చిన కొన్ని స్టెప్పులు, చేతుల ఊళ్లు, పట్లు ఏమంత వివరించానికి అనువుగా లేవు. దీంతో ఇలాంటి స్టెప్పులు ఇచ్చి ఏం చేద్దామని అంటూ శేఖర్ మాస్టర్‌ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. నిజానికి శేఖర్ మాస్టర్ ఇలాంటి స్టెప్పులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. రీసెంట్ టైమ్స్‌లో చూస్తే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఈ పరస్థితి మొదలైంది. ఆ తర్వా ‘పుష్ప: ది రూల్’లో ‘పీలింగ్స్’ పాట సంగతి సరేసరి.
బీ గ్రేడ్ సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు కొన్ని ఉండవు అనేలా ఆ సీన్ అండ్ సాంగ్ సిద్ధం చేశారు. ఇప్పుడు ‘డాకు మహారాజ్’లోనూ అదే పరిస్థితి. దీంతో శేఖర్ తన కొరియోగ్రఫీ విషయంలో క్రాస్ చెక్ చేసుకోవాలి అనే సూచనలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఒక పాటలో కొన్ని స్టెప్పులే ఇవి. ఈ సినిమా 12న వచ్చాక ఇలాంటివి ఇంకెన్ని చూస్తామో అనే సన్నాయి నొక్కులు కూడా కొన్ని వినిపిస్తున్నాయండోయ్.