సంక్రాంతి పండక్కి కనీసం నాలుగైదు సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది సర్వసాధారణం. ఒక్కోసారి విడుదలైన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి, ఒక్కోసారి ఒక్కరే సూపర్ హిట్ కొడతారు. కానీ.. రిజల్ట్ తో సంబంధం లేకుండా సంక్రాంతి సెలవుల సమయంలో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవ్వడం అనేది ఆనవాయితీ. ఎంత డిజాస్టర్ సినిమాలైనా కనీస స్థాయి కలెక్షన్స్ సాధిస్తాయి. సంక్రాంతికి ఉన్న పవర్ అలాంటిది. అందుకే బడా దర్శకులు, స్టార్ హీరోలు తమ సినిమాల్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ఉత్సాహం చూపుతుంటారు.
Game Changer
అయితే.. 2025 సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో మొదటగా వచ్చిన “గేమ్ ఛేంజర్” మీద మాత్రం సోషల్ మీడియా నెగిటివిటీతోపాటుగా గ్రౌండ్ లెవల్ లో సినిమాని తొక్కేయడానికి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. నిజానికి గేమ్ ఛేంజర్ మరీ డిజాస్టర్ సినిమా కాదు, ఎబౌ యావరేజ్ కంటెంట్. రామ్ చరణ్ నటన, తమన్ సంగీతం & టెక్నికాలిటీస్ బాగుంటాయి.
అయితే.. స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడంతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. అయితే.. సినిమా రిజల్ట్ పక్కన పెడితే, ఎబౌ యావరేజ్ సినిమాని డిజాస్టర్ గా చిత్రించే పనిలో పడ్డారు కొందరు. ముఖ్యంగా సినిమా విడుదలైన రెండో రోజే పైరసీ హెచ్.డి ప్రింట్ ను పైరసీ సైట్స్, ట్విట్టర్ & టెలిగ్రామ్ లో విపరీతంగా సర్క్యులేట్ చేసారు.
సరే పైరసీ కామన్ అనుకుంటే.. ఏకంగా బస్సుల్లో, కేబుల్ టీవీల్లో కూడా టెలిక్యాస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక సినిమా కలెక్షన్స్ ని దెబ్బ కొట్టడానికి మరీ ఇంతలా టార్గెట్ చేయాలా? అనిపిస్తుంది. అయితే.. “గేమ్ ఛేంజర్” ఇంత నెగిటివిటీని తట్టుకొని మినిమం కలెక్షన్స్ తో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ తో దూసుకెళుతుంది.