బిగ్ బాస్ 4: అన్ సీన్ లో చెప్పిన రీజన్ ఏంటి..?

బిగ్ బాస్ హౌస్ లో రేస్ టు ఫినాలే టాస్క్ లో గెలిచి ఫినాలే టిక్కెట్ ని తీస్కున్నాడు అఖిల్. 24గంటల పాటు ఇద్దరూ కూడా ఉయ్యాల పైన నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పోటీగా ఈ టాస్క్ ఆడారు. సోహైల్ చివరకి శాక్రిఫైజ్ చేసి అఖిల్ ని గెలిపించాడు. అంతేకాదు, ఉయ్యాల దిగడానికి రీజన్స్ కూడా చెప్పాడు. అఖిల్ ఫుష్ చేసేయ్ అని ఒక మాట అన్నాడు.. దానికి సోహైల్ ఒప్పుకోలేదు. ఫుష్ చేసే బదులు నువ్వు దిగిపో అని ఒక మాట అంటే దిగిపోయి ఉండేవాడు కదా.. అందుకే నేను దిగిపోయాను అంటూ తన బాధని అభిజిత్ తో పంచుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఇక్కడే అఖిల్ కి వాష్ రూమ్ లో తను ఎందుకు దిగిపోయానో రీజన్స్ కూడా చెప్పాడు.

సోహైల్ బ్రేవ్ హార్ట్ కి నిజంగా చాలా గొప్పది. ఎందుకంటే, రాత్రి అంతా దాదాపు 24గంటల పాటు ఉయ్యాలలో ఉండి శాక్రిఫైజ్ చేసేయడం అనేది అంత ఈజీకాదు. పైగా తను నామినేషన్స్ లో లేడు , కాబట్టి డైరెక్ట్ గా ఫినాలేకి వెళ్లిపోవచ్చు. కానీ కాలు జరుపుకుంటున్నా ఆగు అఖిల్ అంటూ మాట్లాడుతూనే కాళ్లు కిందపెట్టేశాడు. దీంతో అఖిల్ షాక్ అయ్యాడు.నిజానికి అక్కడ సంచాలక్ లేడు అప్పుడు అభిజిత్ వాష్ రూమ్ కి వెళ్లాడు.

తర్వాత మనం హాట్ స్టార్ అన్ సీన్ లో చూసినట్లయితే దీనిపై రీజన్స్ కూడా చెప్పాడు సోహైల్. మెహబూబ్ కెప్టెన్ అవ్వడానికి నేను ఏంచేయలేకపోయాను అని , ఆ విషయం నాకు మనసులో ఉండిపోయిందని , తర్వాత నిన్ను ఎత్తుకున్నప్పుడు కూడా నిన్ను కెప్టెన్ గా గెలిపించలేకపోయాను అని అఖిల్ తో చెప్పాడు సోహైల్.

నన్ను తోసేయ్ అని నువ్వు అన్నావ్, ఆ వర్డ్ చాలు నాకు ఇంక చాలు అంటూ మాట్లాడాడు. అంతేకాదు, స్వైప్ చేస్కునేటపుడు కూడా నువ్వు అడిగి ఉంటే నేను చేసేవాడ్ని అప్పుడు కూడా నీకు హెల్ప్ చేయలేదు. ఈ హౌస్ లోనే నేను , మోనాల్ మాత్రమే నీకు సపోర్ట్ గా ఫస్ట్ నుంచి కూడా ఉన్నామని అందుకే ఈ హెల్ప్ చేయాలని అనిపించి చేశానని అన్నాడు. మీ మదర్ నిన్ను కెప్టెన్ గా చూడాలను కుంది కదా , అది నేను చేయలేకపోయాను. అలాగే ఫ్లవర్ టాస్క్ లోనువ్వు ఎక్కువ ఫ్లవర్స్ కలక్ట్ చేసావ్, అలాగే మిల్క్ టాస్క్ లో కూడా బాగా ఆడావ్ ఇవన్నీ నేను కాల్యుక్ లేట్ చేసుకుని దిగిపోయాను అంటూ వివరణ ఇచ్చాడు సోహైల్. అదీ మేటర్.

[yop_poll id=”1″]


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus