( SSMB28) ‘నేను విన్నాను… నేను ఉన్నాను’ ఈ డైలాగ్ ఎవరిది అని అడిగితే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది అని ఠక్కున చెప్పేస్తారు. అంతగా ఫేమస్ అయిపోయింది ఆ డైలాగ్. అయితే ఆ డైలాగ్‌ను సినిమాలో వాడేశారు మహేష్ బాబు. దాంతో అది జగన్ మీద సెటైర్ అని కొందరు, కాదు జగన్ గురించి గుర్తు చేసినట్లుగా అని మరికొందరువ వాదించి, వాదించి వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. మరోసారి మహేష్‌బాబు సినిమా జగన్‌కు లింక్ పెడుతున్నారు నెటిజన్లు.
అయితే ఈసారి కారణం సినిమాలో డైలాగ్ కాదు. సినిమా టైటిలే. దీనికి కారణం డైరక్టర్ త్రివిక్రమ్ సెంటిమెంట్. మహేష్ సినిమా – వైఎస్ జగన్ – త్రివిక్రమ్ సెంటిమెంట్. ఇదంతా కాస్త కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. అయితే ఈ వార్త చదివితే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. దీని కోసం వెనుక నుండి చూసుకుంటూ రావాలి. అంటే త్రివిక్రమ్ కాన్సెప్ట్ నుండి చూడాలి అన్నమాట. గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ సినిమాలు చూస్తే.. సినిమా పేర్లలో ‘అ/ఆ’ అనేది కామన్‌గా ఉంటుంది.
అంటే అంటే ఆ రెండు అక్షరాలతో ఆయన సినిమా పేర్లు ఉంటాయి. దీంతో మహేష్‌బాబు 28వ సినిమాకు కూడా అలాంటి పేరే ఉంటుంది అని అనుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొస్తున్న పథకాల పేర్లు ‘అ/ఆ’తో ఉంటున్నాయి. మొన్నీమధ్య ‘అమ్మ ఒడి’ అంటూ ఓ పథకం పెట్టారు. దీంతో ఇదే మహేష్‌బాబు సినిమా టైటిల్ అంటూ చర్చ లేపారు. అయితే ఒకట్రెండు రోజులకే ఆ చర్చ ఆగిపోయింది. ఇప్పుడు ‘అమరావతికి అటు ఇటు’ అంటూ మరో పేరు చర్చకు వచ్చింది.
అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచనల విషయంలో రాష్ట్రంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పేరును చర్చకు తెచ్చారు అని అంటున్నారు. దీంతో మహేష్ సినిమా టైటిల్స్ అన్నీ జగన్ చుట్టూనే తిరుగుతున్నాయి ఎందుకో అంటూ వైసీపీ కార్యకర్తలు, మహేష్ అభిమానులు అంటున్నారు. ఇదంతా ఓ వర్గం పనే అనేది వారి మాట.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?