Adipurush: టాలీవుడ్ స్టార్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి.. ఏం జరిగిందంటే?

ఆదిపురుష్ మూవీ నుంచి ట్రైలర్ విడుదల కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. ఆదిపురుష్ హిందీ, తెలుగు ట్రైలర్లకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా ఆ వ్యూస్ చూసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. ఆదిపురుష్ సినిమాపై పెరిగిన అంచనాలకు ఈ వ్యూస్ నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆదిపురుష్ ట్రైలర్ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరూ స్పందించకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది. ఆదిపురుష్ ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో పాటు మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిందనే సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ ట్రైలర్ విజువల్ వండర్ అనేలా ఉందని ప్రభాస్ ఖాతాలో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీజర్ విషయంలో వచ్చిన నెగిటివ్ కామెంట్లు ట్రైలర్ విషయంలో వినిపించలేదు. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగింది. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీలను వినియోగించారనే సంగతి తెలిసిందే. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా రెమ్యునరేషన్ల కోసమే ఎక్కువ మొత్తం ఖర్చు చేశారని తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్స్ ఇప్పటికైనా ఆదిపురుష్ ట్రైలర్ గురించి రియాక్ట్ అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలో ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిసనన్ ప్రభాస్ గురించి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ (Adipurush) సినిమా సక్సెస్ సాధిస్తే రాబోయే రోజుల్లో ప్రభాస్ కృతి కాంబినేషన్ ను రిపీట్ చేయాలని పలువురు డైరెక్టర్లు భావిస్తున్నారు. ప్రభాస్ కృతి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆదిపురుష్ తో ప్రభాస్ 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus