Vijay Devarakonda: విజయ్‌ మీ ఇంట్లోనే ‘నెపో’ హీరో ఉన్నాడుగా.. నువ్వు కూడా..

విజయ్‌ దేవరకొండ సినిమాల ప్రచారంలో కొన్ని ప్యాటర్న్స్‌ ఉంటాయి. వాటిని ఆయన రిపీట్‌ మోడ్‌లో వాడుతుంటాడు. యాటిట్యూడ్‌, నెపో టాపిక్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. ఆయన సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో బయట కూడా అలానే ఉంటాడు. మాటలు, పంచ్‌లు, కూర్చునే స్టైల్‌ ఇలా అన్నింటా తన యాటిట్యూడ్‌ చూపిస్తూ ఉంటాడు. అది కొన్నిసార్లు మిస్‌ ఫైర్‌ వివాదాల వరకు వెళ్తుంటాయి. ఇక రెండోది నెపో కిడ్స్‌ టాపిక్‌. ‘తాతలు, తండ్రులు హీరోలు’ అని ఒకసారి, డైరెక్ట్‌ నెపో హీరోస్‌ అని కూడా అంటుంటారు.

Vijay Devarakonda

గతంలో ఇలా అని.. ఫ్యాన్స్‌ నుండి విమర్శలు ఎదుర్కొన్న విజయ్‌.. ఇప్పుడు మరోసారి అదే పని చేశారు.. అలాంటి రియాక్షనే పొందుతున్నాడు. ఇటీవల ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ. తన సమకాలీకుడు అయిన హీరోకి ఆయన తండ్రి ఒకరు సినిమాల విషయంలో సాయం చేస్తారని, కథలు రాయిస్తారని ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. కొన్నిసార్లు నో చెబుతున్నారని.. తనకు ఆ పరిస్థితి ఉండేది కాదని, నెపో హీరోస్‌కు ఆ అవకాశం ఉందనేలా మాట్లాడాడు. అయితే ఇప్పుడు తాను ఆ స్థాయికి వచ్చి కథలకు నో చెప్పగలుగుతున్నా అని అన్నాడు.

తానెంత ఎదిగాడో చెప్పుకోవడంలో విజయ్‌ తప్పేమీ లేదు.. కానీ ఇంకో హీరో ఇలా చేస్తున్నాడు, వాళ్ల నాన్న అలా చేస్తున్నాడు అని లేనిపోని టాపిక్‌లకు ఎందుకు వెళ్లడం అనేది ఇక్కడ ప్రశ్న. విజయ్‌ వాళ్ల తండ్రి గోవర్దన్‌ కూడా దర్శకుడే. చాలా సీరియళ్లకు దర్శకత్వం వహించి కథల మీద మంచి పట్టే సంపాదించుకున్నారాయన. ఇక విజయ్‌ ఇంట్లోనే నెపో హీరో ఉన్నారు.

విజయ్‌ను చూసుకునే అతని తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరో అయ్యారు. కొడుకు మాత్రమే కాదు, తమ్ముడు సినిమాల్లోకి వచ్చినా నెపోనే అంటారు అని విజయ్‌ మరచిపోయాడేమో. నెపో కిడ్స్‌కు ఇండస్ట్రీలో పరిస్థితి బాలేదని తెలిసినా.. ఇంకా నెపోటిజం గొప్ప పదార్థం అనుకొని హీరోలు ఇలా మాట్లాడితే ఫ్యాన్స్‌ ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి విజయ్‌ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పొచ్చు.

సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus