Vijay Devarakonda: విజయ్‌ని అంతెత్తుకు తీసుకెళ్లిన బ్రాండ్‌ని వదిలేస్తున్నాడు… ఎందుకంటే?

విజయ్‌ దేవరకొండను అభిమానులు ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. అలాగే విజయ్‌ కూడా తన అభిమానులను నా డియర్‌ రౌడీ బాయ్స్‌ అని పిలుచుకుంటూ ఉంటాడు. అంతగా విజయ్‌ – ఫ్యాన్స్‌ మద్య ‘రౌడీ’ అనే పదానికి బాండింగ్‌ ఉంది. నిజానికి ఇది ఇప్పటిది కాదు ఐదేళ్ల క్రితమే విజయ్‌ ఈ బ్రాండ్‌ను తీసుకొచ్చాడు. దాని మీద యూత్‌కు బాగా నచ్చే రకరకాల దుస్తుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. తొలి నాళ్లలో అదరణ బాగున్నా.. ఆ తర్వాత ఆసక్తి తగ్గింది అని చెప్పొచ్చు.

ఇదంతా ఓకే కానీ ఇప్పుడు ‘రౌడీ’ గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే విజయ్‌ ఇప్పుడు ఆ బ్రాండ్‌ను మూసేస్తున్నాడు. దీనికి సంబంధించి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దాని బట్టి చూస్తే ‘రౌడీ’ బ్రాండ్‌ను క్లోజ్‌ చేసి… దాని స్థానంలో కొత్త బ్రాండ్‌ తీసుకొచ్చే పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే దీపావళికి దీనికి సంబంధించి భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి ఆ కొత్త బ్రాండ్‌ను అనౌన్స్‌ చేస్తాడట. ఈ మేరకు వీడియోలో చెప్పుకొచ్చాడు విజయ్‌.

2018లో ‘రౌడీ’ పేరుతో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టాడు (Vijay Devarakonda) విజయ్‌. ఆ విషయాన్ని చెబుతూ రౌడీ వేర్‌కు సంబంధించి గతంలో జరిగిన కార్యక్రమాల దృశ్యాలను వీడియోలో చూపించాడు. నిజానికి ఈ విషయంపై కొన్ని రోజుల క్రితమే హింట్‌ ఇచ్చాడు విజయ్‌. ఓ అమ్మాయి చేతిలో, ఓ అబ్బాయి చేయి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశాడు. అందులో ఓ చేతికి వాచ్‌ కనిపిస్తోంది. అప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడేమో అనుకున్నారు కానీ… ఇప్పుడు ఆ స్టోరీ ప్రకారం వాచీల బిజినెస్‌లోకి వస్తున్నాడు అంటూ మాట్లాడుతున్నారు.

మరికొందరైతే గతంలో కేవలం కుర్రాళ్లకు మాత్రమే దుస్తులు డిజైన్‌ చేసి అమ్మిన విజయ్‌ ‘రౌడీ’ బ్రాండ్‌… ఇప్పుడు కొత్త బ్రాండ్‌తో అటు కుర్రాళ్లు, ఇటు అమ్మాయిలకు దుస్తులు ఉండేలా చూసుకుంటున్నారని అంటున్నారు. దీని కోసం ఓ యువ మహిళా వ్యాపారేవత్తతో చేతులు కలిపాను అని చెప్పడానికే ఆ ఇన్‌స్టా స్టోరీ పెట్టారు అని అంటున్నారు. దీనిపై క్లారిటీ దివాళీకి వస్తుంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus