Abhishek, Aishwarya: పెద్ద చర్చకు దారి తీసిన అభిషేక్ బచ్చన్ ట్వీట్..!

అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ .. అనుకున్న రేంజ్లో స్టార్ కాలేకపోయాడు. సెకండ్ హీరోగానే అతను సెటిల్ అయ్యాడు. అయితే ఐశ్వర్య రాయ్ ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇతని క్రేజ్ పెరిగింది అని చెప్పొచ్చు. అయితే ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు అంటూ పలు మార్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అది అసత్య ప్రచారం అని అభిషేక్ టీం నుండి సంకేతాలు వినిపించాయి. ఇప్పుడు మళ్ళీ ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

మొన్నటికి మొన్న దీపికా- రణ్ వీర్ లు కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. బాయ్ కాట్ ట్రెండ్ బోర్ కొట్టి కొంతమంది నెటిజన్లు ఇలాంటి వార్తలను వైరల్ చేసి ట్రెండింగ్లో నిలబెడుతున్నారా ఏంటి? అన్న విషయం పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అభిషేక్ బచ్చన్ గతంలో చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ‘నేను విడాకులు తీసుకోబోతున్నాను అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అందుకు నేను సిద్ధమే. అలాగే నాకు రెండో పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీదే.

అది మర్చిపోకండి. థాంక్యూ’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. 2007వ సంవత్సరం ఏప్రిల్ 20న వీరి పెళ్లి జరిగింది. 2014లో వీరికి ఓ పాప కూడా పుట్టింది.వీరికి ఆరాధ్య అనే పేరు కూడా పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో అభిషేక్.. తన భార్య ఐశ్వర్య గురించి మాట్లాడుతూ..

“ఐశ్వర్య తో నా జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్దేశించడానికి మూడో వ్యక్తి అవసరం లేదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు. ఆమె ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు” అంటూ చెప్పుకొచ్చాడు. కొందరు నెటిజన్లు ఆ కామెంట్స్ ను మరోసారి గుర్తుచేస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus