Adipurush: ఆదిపురుష్ మేకర్స్ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారా?

ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒకవైపు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూనే మరోవైపు ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఒకింత టెన్షన్ పడుతున్నారు. ఆదిపురుష్ రిజల్ట్ విషయంలో ఎలాంటి నెగిటివ్ కామెంట్లు వినిపించకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్ కు నచ్చేలా ఈ సినిమా ఉంటే చాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆదిపురుష్ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ కు తెలుగుపై ఎక్కువగా అవగాహన లేదనే సంగతి తెలిసిందే.

అయితే ఆదిపురుష్ మూవీ డబ్బింగ్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదిపురుష్ మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ దర్శకుని కెరీర్ కూడా ఈ సినిమాపై ఆధారపడి ఉందని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓం రౌత్ ఈ సినిమాకు సంబంధించిన ట్వీట్లలో తెలుగులో ఎక్కువగా తప్పులు రాయడంతో ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

ట్వీట్లలో తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని సినిమాలో తప్పులు ఉంటే మాత్రం ఆ అవకాశం కూడా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆదిపురుష్ మూవీ బిజినెస్ పరంగా రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ మూవీ హిట్టైతే మాత్రమే ఓం రౌత్ కు ఆఫర్లు ఇవ్వాలని పలువురు హీరోలు భావిస్తున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని భావిస్తున్నారు.

ఆదిపురుష్ (Adipurush) రిజల్ట్ ను బట్టి టాలీవుడ్ హీరోల నిర్ణయాలు మారే అవకాశం ఉంది. ఆదిపురుష్ మూవీకి పోటీగా పలు హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆదిపురుష్ మూవీ కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ రేంజ్ ను పెంచే విధంగా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus