Bigg Boss 5 Telugu: సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ గెలిచింది ఎవరు..?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నడుస్తోంది. సూపర్ విలన్స్ కి సూపర్ హీరోస్ కి మద్యలో పోటాపోటీ ఆట షురూ అయ్యింది. ఇందులో ఫస్ట్ హీరోస్ నుంచీ శ్రీరామ్ చంద్ర విలన్స్ కి గట్టిపోటీ ఇచ్చాడు. ఎక్కడా రాజీపడకుండా విలన్స్ ఇచ్చిన అన్ని టాస్క్ లని ఫినిష్ చేశాడు. అలాగే, రవి కూడా విలన్స్ టీమ్ నుంచీ వచ్చి సూపర్ గా టాస్క్ లో ఆడాడు. అందరూ చెప్పిన పనులు చేస్తూ తనని తాను టాస్క్ లో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది.

నిజానికి పాయింట్స్ దక్కించుకున్న హీరోస్ టీమ్ కాకుండా థండర్ దక్కించుకున్న విలన్స్ టీమ్స్ గెలిచినట్లుగా సమాచారం తెలుస్తోంది. థండర్ ని విలన్స్ టీమ్ దక్కించుకుని హీరోస్ పై విజయం సాధించినట్లుగా చెప్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈసారి కెప్టెన్సీ పోటీదారులుగా ఆరుగురు రేస్ లో నిలిచారని, వీరిలో అనీమాస్టర్ ఇంకా రవిల మద్యనే గట్టిపోటీ పడిందని అంటున్నారు. ఎందుకంటే, గత కొన్నివారాలుగా చూస్తే వీళ్లిద్దరే హౌస్ లో కెప్టెన్ అవ్వలేదు.

అయితే, అనీమాస్టర్ – రవి ఇద్దరిమద్యలోనే గట్టి పోటీ పడితే ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. నిజానికి లాస్ట్ వీక్ అనీమాస్టర్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో లాస్ట్ వరకూ వెళ్లి ఓడిపోయింది. అప్పుడు షణ్ముక్ ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు కూడా రవితో కలిసి కెప్టెన్ పోటీదారులగా పోటీ పడబోతోందట. మరి ఈసారి అనీమాస్టర్ కెప్టెన్ అయ్యిందా.. లేదా రవి కెప్టెన్ అయ్యాడా అనేది తెలియాల్సి ఉంది. అదీ మేటర్.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus