సరికొత్త ప్రయోగానికి బాలకృష్ణ రెడీ..!

నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో చాలా మారారు. అంటే.. సినిమాల విషయం సంగతి చెబుతున్నా..! గతంలో మాస్ కథలంటే చాలు.. డైరెక్షన్ అంటే అనుభవం లేని కొత్త వాళ్ళకు కూడా ఓకే చెప్పేసేవాడు. ‘పైగా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండాలి.. ఆ ఇద్దరూ కూడా బాలయ్యకే లైన్ వెయ్యాలి’ అన్నట్టు సన్నివేశాలు ఉండాలని డైరెక్టర్లకు మొదట్లోనే చెప్పేసేవాడట.తాను హీరోయిన్ల వెంట పడుతున్నట్టు సన్నివేశాలు ఉంటే తన అభిమానులు ఒప్పుకోరు అని దర్శకులకు గట్టిగా చెప్పేవాడు. ఇప్పుడలా కాదు.. మంచి కథలు చెయ్యాలి అని చూస్తున్నాడు.

హీరోయిన్ల విషయంలో షరతులు పెట్టడం లేదు అన్నది ఇన్సైడ్ టాక్. ఈ మధ్యనే ఓ కూతురికి తండ్రిగా నటించే పాత్రకు కూడా బాలయ్య ఓకే చెప్పాడట. అంతేకాదు సినిమాలో విగ్గు పెట్టుకోకుండా నటించడానికి కూడా బాలయ్య ఓకే చెప్పాడట. నిజానికి బాలయ్య సినిమాలకు విగ్గు అనేది పెద్ద సమస్యగా ఉండేది. గతంలో ‘అల్లరి పిడుగు’ ‘వీరభద్ర’ ‘మహారథి’ ‘రూలర్’ వంటి చిత్రాల్లో బాలయ్య విగ్గులు చాలా ఘోరంగా ఉంటాయి.అభిమానులు కూడా నిరాశపడ్డారు అంటే అర్ధం చేసుకోవచ్చు. ఆయనకు తగిన విగ్గు సెట్ చెయ్యడం అంటే కష్టమే మరి.

అయితే బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఆయన చెయ్యబోతున్న సినిమాలో.. రెండో పాత్ర కోసం ఆయన విగ్గు లేకుండా నటించబోతున్నాడట. నిజానికి ఈ చిత్రంలో మొదట అఘోరా పాత్ర ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఆ పాత్రను ఇప్పుడు తొలగించి మార్పులు చేశారట. దాంతో ఈ సినిమాలో పెద్ద బాలయ్య విగ్గు లేకుండా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus