Balakrishna,Mokshagna: అలాంటి కథలో మోక్షజ్ఞ నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారా?

నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మోక్షజ్ఞ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చిరంజీవి కొడుకు చరణ్, నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మోక్షజ్ఞ కూడా సినిమాల్లో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి రావాలంటే లుక్ ను సైతం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు బాలయ్య ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్2 ప్రారంభం కావాల్సి ఉండగా ఈ షో ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఈ మధ్య కాలంలో బాలయ్య ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

హిందూపురంలో అన్న క్యాంటీన్ ద్వారా ప్రజలకు బాలయ్య అతి తక్కువ ధరకే ఆహారం అందేలా చూస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య తర్వాత సినిమాలతో కూడా సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్2 లో స్పెషల్ గెస్టులు ఉండేలా షో నిర్వాహకులు ప్లాన్ చేశారని తెలుస్తోంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus