మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ , నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు సాధించాయి. రిలీజ్ కు ముందు ఈ రెండు సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు సినిమాలు సూపర్ హిట్లు అయినప్పటికీ.. ‘వీరసింహారెడ్డి’ కంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎక్కువగా కలెక్ట్ చేసింది. ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ కూడా నటించడంతో మల్టీస్టారర్ అప్పీల్ ఉండటం వల్ల ‘వాల్తేరు వీరయ్య’ ఎక్కువగా కలెక్ట్ చేసింది
అంటూ వాదించే బాలయ్య ఫ్యాన్స్ ఉండనే ఉన్నారు. కానీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ముందు చిరంజీవికి రెండు రూ.100 కోట్ల షేర్ మూవీస్ ఉన్నాయి. అంతేకాదు ప్రభాస్ కాకుండా మొదటి వంద కోట్ల షేర్ ను కలెక్ట్ చేసిన మూవీ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150 ‘ నే కావడం విశేషం. బాలయ్య కెరీర్లో వంద కోట్ల షేర్ మూవీ ఇంకా రిజిస్టర్ కాలేదు.
‘అఖండ’ రూ.75 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయగా, ‘వీరసింహారెడ్డి’ రూ.77 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేసింది. ఇది పక్కన పెడితే.. ఇదే ఏడాది బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ , చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ‘భోళా శంకర్’ పై పెద్దగా అంచనాలు లేవు. కానీ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
దసరా కానుకగా ఈ మూవీ (Bhagavath Kesari) రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో వందకోట్ల షేర్ కు పైగా కలెక్ట్ చేసి బాలయ్య.. చిరు పై పైచేయి సాధిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఫుల్ రన్లో రూ.130 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ‘భగవంత్ కేసరి’ కి హిట్ టాక్ వస్తే ఆ ఫీట్ ను అందుకునే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఇక..!