Chiranjeevi: వీరయ్య పార్టీ.. ఫుల్‌ జోష్‌లో సాగిందటగా..!

సినిమా సక్సెస్‌ అయితే చాలు పార్టీ ఇవ్వడం చిరంజీవికి అలవాటు. ఈ సంప్రదాయం ఇప్పటి నుండి కాదు.. ఆయన కుర్ర స్టార్‌ హీరోగా ఉన్నప్పటి నుండి చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తుంటారు కూడా. ఈ క్రమంలో ఆయన సినిమానే కాదు, అతని సన్నిహితుల సినిమాలు విజయం అందుకున్నా పార్టీ ఇస్తుంటారు. అలాంటిది ఆయన సినిమా భారీ విజయం అందుకుంటే.. ఎంత పెద్ద పార్టీ ఇవ్వాలి చెప్పండి. ‘వాల్తేరు వీరయ్య’ విజయం పురస్కరించుకుని చిరంజీవి ఇంట్లో భారీ పార్టీ జరిగింది అని చెబుతున్నారు.

సంక్రాంతి సందర్భంగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా విడుదలై భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు రవితేజ కూడా కీలక పాత్రధారిగా నటించారు. ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తుండటంతో శుక్రవారం రాత్రి చిరంజీవి సినిమా టీమ్‌, సన్నిహితుల్ని పిలిచి పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. ఆ మాటకొస్తే చిరంజీవి ఇంట్లో నిత్యం ఏదో ఓ పార్టీ జ‌రుగుతూనే ఉంటుంది అంటుంటారు. డిసెంబ‌రు 31న రాత్రి ‘వాల్తేరు వీర‌య్య‌’ సినిమా టీమ్‌కి స్పెష‌ల్ పార్టీ ఇచ్చారు చిరంజీవి. సినిమా విడుదలకు ముందే పార్టీ ఇచ్చి తనకు సినిమా విజయం మీద ఎంత నమ్మకం ఉందో చెప్పకనే చెప్పారు.

తను ఊహించిన విధంగా సినిమా విజయం అందుకోవడంతో మరోసారి పార్టీ చేసుకోవాలని చిరు నిర్ణయించారట. ఈ మేరకు శుక్ర‌వారం రాత్రి చిరు ఇంట్లో ఓ స్పెష‌ల్ పార్టీ జ‌రిగిన‌ట్టు టాక్‌ వినిపిస్తోంది. ముందుగా చెప్పినట్లు ఈ పార్టీలో ‘వాల్తేరు వీర‌య్య’ సినిమా టీమ్ తో పాటుగా, ‘భోళా శంక‌ర్’ సినిమా టీమ్ కూడా హాజ‌రైంద‌ని స‌మాచారం. దీంతోపాటు చిరు సన్నిహిత దర్శకులు, రచయితలు కూడా హాజరయ్యారని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఫొటోలు ఏవీ బయటకు రాలేదు.

రాజకీయాల్లోకి వెళ్లిపోవడం వల్ల చిరంజీవి – సినిమా మధ్య తొమ్మిదేళ్ల విరామం వచ్చింది. ఆ త‌ర‌వాత ఆయన మ‌ళ్లీ సినిమాలు మొద‌లెట్టిన ఇంత పెద్ద కమర్షియల్‌ విజయం దక్కలేదు. ‘ఖైదీ నెం.150’, ‘సైరా’ వంటి విజయవంతమైన సినిమాలొచ్చినా.. భారీ వసూళ్లు రాలేదు. ‘ఆచార్య’ ఫలితం చేదుగా మారగా, ‘గాడ్ ఫాద‌ర్’ తొలుత తీపిగా ఉన్న తర్వాత చప్పగా మారింది. దీంతో ‘వాల్తేరు వీరయ్య’ విజయం చిరంజీవికి మంచి బూస్ట్‌ ఇచ్చింది అంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus