మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సినీ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద చిరంజీవి క్రియేట్ చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు. చిరంజీవి కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చినా రీఎంట్రీలో భారీ విజయాలను అందుకున్నారు. సీనియర్ హీరోలలో చిరంజీవి ప్రస్తుతం నంబర్ హీరో అనే సంగతి తెలిసిందే. చిరంజీవి నటించినన్ని సినిమాలు ఈ జనరేషన్ హీరోలు నటించలేరని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మెగా యంగ్ హీరోలకు హిట్లు దక్కుతున్నా వరుసగా హిట్లు సొంతం చేసుకోవడంలో (Sai Dharam Tej) సాయితేజ్, (Varun Tej) వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej) ఫెయిలవుతున్నారు.
ఈ హీరోలకు చిరంజీవి కథల విషయంలో మరిన్ని సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మెగా యంగ్ హీరోలు స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ జనరేషన్ ప్రేక్షకుల టేస్ట్ కు అనుగుణంగా మెగా యంగ్ హీరోలు కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ప్రయోగాలు చేయడం కంటే ప్రేక్షకులు మెచ్చే కథలకు ప్రాధాన్యత ఇస్తే కెరీర్ కు ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది.
సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ భారీ విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా యంగ్ హీరోల పారితోషికాలు 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నట్టు సమాచారం అందుతోంది. మెగా హీరోలకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కరోనా తర్వాత ప్రేక్షకులు పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే ఆదరిస్తున్నారు. మెగా హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే విశ్వంభర (Vishwambhara) సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి రిలీజ్ చేసేలా చిరంజీవి కెరీర్ ప్లానింగ్ ఉంది. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం చిరంజీవి, త్రిష (Trisha) కలిసి పని చేస్తున్నారు.