Das Ka Dhamki: దాస్ కా ధమ్కీ హిందీలో సక్సెస్ కావడం సాధ్యమేనా?

ఈ మధ్య కాలంలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ పాన్ ఇండియా సినిమాలుగా విడుదలై నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ సినిమా తెలుగులో అబవ్ యావరేజ్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఈ సినిమా ఫెయిలైంది. దాస్ కా ధమ్కీ ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం ఆశించిన రేంజ్ లో లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

మరికొన్ని గంటల్లో ఆహా ఓటీటీలో (Das Ka Dhamki) ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండగా అదే సమయంలో హిందీలో కూడా ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. అయితే హిందీలో ఈ సినిమాకు బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. కొన్ని థియేటర్లలో అయితే పూర్తిస్థాయిలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దాస్ కా ధమ్కీ హిందీ రిలీజ్ వల్ల విశ్వక్ సేన్ నష్టపోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దాస్ కా ధమ్కీ హిందీ రిజల్ట్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని విశ్వక్ సేన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాస్ కా ధమ్కీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని బోగట్టా. విశ్వక్ సేన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా సినిమా సినిమాకు విశ్వక్ సేన్ మార్కెట్ పెరుగుతోంది.

తన సినిమాలలో కొన్ని సినిమాలకు విశ్వక్ సేన్ తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విశ్వక్ సేన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus