మహేష్ బాబు (Mahesh Babu) సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) సినిమా ఒకటి. మహేష్ అనిల్ (Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా 2020 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సొంతం చేసుకుని 2020 సంవత్సరం ఉగాది కానుకగా ప్రసారం చేయగా ఆ సమయంలో ఈ సినిమాకు ఏకంగా 23.4 రేటింగ్ వచ్చింది. బుల్లితెరపై ఈ రేంజ్ రేటింగ్ అంటే రికార్డ్ అనే చెప్పాలి.
ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు బుల్లితెరపై ప్రసారమవుతున్నా చాలా సినిమాలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. అయితే గుంటూరు కారం సినిమా కూడా జెమిని ఛానల్ లో ఉగాది కానుకగా ప్రసారం కానుందని తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమా మ్యాజిక్ ను ఈ సినిమా రిపీట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో జెమిని ఛానల్ నుంచి ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా రిలీజ్ సమయంలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా ప్రముఖ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
గుంటూరు కారం సినిమాలో శ్రీలీల (Sreeleela) మెయిన్ హీరోయిన్ గా నటించగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. కథ, కథనం విషయంలో పొరపాట్లు జరగకుండా ఉండి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం మూవీ ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) సినిమాతో బిజీగా ఉన్నారు.