టాలీవుడ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినిమా. వాళ్లెక్కువ, వీళ్లెక్కువ అని ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సమంగా సినిమాను ఆదరిస్తారు, విజయం అందిస్తారు, వసూళ్లూ అందిస్తారు. అయితే మరి టాలీవుడ్ నుండి రెండు రాష్ట్రాలకు ఒకేలా ఆదరణ ఉందా? అంటే లేదు అనే చెప్పాలి. అందుకే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి టాలీవుడ్‌కి ‘మా దగ్గరకు రండి’ అనే పిలపు వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే పిలుపు వినిపించింది.
Pawan Kalyan
రామ్‌చరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రియల్ గేమ్ ఛేంజర్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా గురించి, సినిమా పరిశ్రమ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ‘ఏపీకి రండి’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు కొన్ని చేశారు. అలాగే ఇక్కడి యువతు తీర్చిదిద్దండి, ఉపయోగించుకోండి అని పిలుపు కూడా ఇచ్చారు.
తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన దిల్ రాజుగారికి (Dil Raju) ఈ సందర్భంగా ఒక సూచన చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూడకండి. తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బాగుండాలి. ఆంధ్రప్రదేశ్‌లో బలమైన యువత ఉంది. వారి శక్తిని వినియోగించుకోండి. ఏపీలో స్టంట్ స్కూల్స్ పెట్టండి, సినీ పరిశ్రమలోని నిపుణులతో యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచండి అని పిలుపునిచ్చారు. అలాగే రాజమౌళి (S. S. Rajamouli), త్రివిక్రమ్ (Trivikram) లాంటి వ్యక్తులను తీసుకొచ్చి స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే లాంటి విషయాలపై క్లాస్‌లు తీసుకోమని చెప్పండి.
కీరవాణి (M. M. Keeravani), తమన్ (S.S.Thaman) లాంటి వాళ్లతో సంగీతంపై అవగాహన పెంచే ఏర్పటు చేయండి. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన విషయాలూ నేర్పండి. ప్రొడక్షన్ డిజైన్ స్కూల్స్ పెట్టండి. ఇక్కడ స్టూడియోలు కూడా పెట్టండి అని పవన్ (Pawan Kalyan) కోరారు. ఇప్పటివరకు పరిశ్రమకు అవసరమైనవి ఇవ్వడమే కానీ ఎప్పుడూ అడగని ఎన్‌డీఏ గవర్నమెంట్ తొలిసారి పరిశ్రమను అడిగింది. మరి ఇప్పటికైనా పరిశ్రమ నుండి ఈ విషయంలో స్పందన వస్తుందా అనేది చూడాలి. ఇప్పటికీ పరిశ్రమ వ్యక్తులు రియాక్ట్ కాకపోతే టాలీవుడ్‌కే చెడ్డపేరు.