‘ధమాకా’ (Dhamaka), ‘బలగం’ (Balagam), ‘మ్యాడ్’ (Mad), ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) అంటూ వరుసగా యూత్ ఫుల్ సినిమాలు, ఊపునిచ్చే సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo). ఆయన ఇప్పుడు సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) అనే సినిమాతో వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ గురించి, ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 13 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని వివరించారు. ఈ సినిమాను తన జీవితంలో ఓ అద్భుతం అని చెప్పొచ్చు అన్నారు భీమ్స్.
Bheems Ceciroleo
ఎందుకంటే 13 ఏళ్ల క్రితం దర్శకుడు అనిల్ రావిపూడితో (Anil Ravipudi) కలసి పని చేసే అవకాశం భీమ్స్‌కి వచ్చిందట. ‘పటాస్’ (Pataas) సినిమా చేసే ఛాన్స్ అప్పట్లో వచ్చినా కొన్ని కారణాల వల్ల కుదర్లేదట. అప్పట్నుంచి అనిల్ రావిపూడితో సినిమా చేయాలని అనుకుంటున్నా.. ఇప్పటికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో కుదిరింది అని భీమ్స్ (Bheems Ceciroleo) చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ముందు వెంకటేశ్‌ను (Venkatesh) డైరెక్ట్‌గా ఎప్పడూ చూడలేదని, ఆయనతో సినిమా ఛాన్స్ అనగానే ఆయన సినిమాల, పోస్టర్లు కళ్ల ముందు తిరిగాయట.
ఇక తాను కంపోజ్ చేసిన పాటను వెంకటేశ్ పాడటం తనకు ఓ అవార్డు అని చెప్పారు. ఆ పాట ట్యూన్ విన్నప్పుడు వెంకటేశ్ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారట. ఆ తర్వాత ఫోన్ చేసి వెంకటేశ్ పాడతారు అనిల్ చెప్పారట. రమణ గోగుల (Ramana Gogula) ఆ పాటను పాడాతానని చెప్పినప్పుడే ‘గోదారి గట్టు’ పాట పెద్ద హిట్టయిందని ఫిక్స్ అయ్యా. ఆ పాటకు యూట్యూబ్‌లో 70 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.