Dasara: నాని విషయంలో అలా చేయడానికి జగన్ అంగీకరిస్తారా?

మరికొన్ని గంటల్లో నాని, కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన దసరా మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు వేరే రేంజ్ లో ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా కలెక్షన్లు సైతం ఆ రేంజ్ లో ఉంటే మాత్రమే సినిమాకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఈ సినిమా నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

అయితే నాని గతంలో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను తగ్గించడం గురించి గతంలో ఒక సందర్భంలో చేసిన కామెంట్లు హాట్ టాపిక్ కావడంతో పాటు ఆ కామెంట్ల విషయంలో సీఎం జగన్ సీరియస్ అయ్యారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. టికెట్ రేట్ల పెంపు సమస్య వల్లే ఏపీలోని పలు ప్రాంతాల్లో దసరా మూవీ బుకింగ్స్ ఇంకా మొదలుకాలేదని సమాచారం అందుతోంది. దసరా మూవీ టికెట్ రేట్లు పెంచడానికి జగన్ ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరోవైపు దసరా సిని (Dasara)మా నాని మార్కెట్ ను డిసైడ్ చేయనుంది. ఈ సినిమా కలెక్షన్ల ఆధారంగా ఆధారంగా నాని భవిష్యత్తు సినిమాల బడ్జెట్లు డిసైడ్ కానున్నాయి. నాని పారితోషికం ప్రస్తుతం 20 నుంచి 22 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. నాని సినిమాల డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. ఈ రీజన్ వల్లే నాని పారితోషికం, మార్కెట్ పెరుగుతోంది.

అద్భుతమైన కథతో దర్శకులు వస్తే మల్టీస్టారర్స్ లో నటించడానికి సైతం నాని సిద్ధంగా ఉన్నారు. నాని తన న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాని కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు ఇతర భాషల్లో కూడా సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాని పాన్ ఇండియా హీరోగా ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus