మైత్రీ మూవీ మేకర్స్‌ అడగాలనుకోవడం లేదా? అడగరా?

హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్‌లు ఇవ్వడంలో ముందుండే నిర్మాతల లిస్ట్‌ తీస్తే తొలుత వచ్చే బ్యానర్‌ పేర్లలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఉంటుంది. పెద్ద హీరోలు, దర్శకులు వీళ్లు అడ్వాన్స్‌లు ఇచ్చి లాక్‌ చేసేస్తూ ఉంటారు. అలా వాళ్ల అడ్వాన్స్‌లు చాలామంది హీరోలు, దర్శకుల దగ్గర ఉన్నాయి అంటారు. అయితే అడ్వాన్స్‌ తీసుకొని సినిమా చేయడం ఆలస్యమైనా, చేయకపోయినా అదే స్పీడ్‌గా వసూలు చేస్తారు అని కూడా చెబుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే..

ఓ హీరో నుండి వసూలు చేయాల్సిన అవసరం ఉన్నా.. చేయడం లేదు అని వార్తలొస్తున్నాయి కాబట్టి. మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్ల అడ్వాన్స్‌లు ఉన్న హీరోల లిస్ట్‌ తీస్తే.. అందులో టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌, బాలీవుడ్‌ హీరోలు కనిపిస్తున్నారు. దర్శకుల సంగతి కూడా ఇంతే. అయితే డబ్బులు తీసుకొని సినిమా చేయలేకపోయి, వెనక్కి ఇచ్చినవాళ్ల జాబితాలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఉన్నారనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే త్రివిక్రమ్‌ కొన్ని పనులు చేస్తున్నారని పుకార్లు కూడా వస్తున్న విషయమూ తెలిసిందే.

ఆ విషయం పక్కనపెడితే.. అలా మైత్రీ వాళ్లు ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారా అనేదే చర్చ. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ అనే సినిమాను పవన్‌ కల్యాణ్‌ చేయాల్సి ఉంది. ఈపాటికి సినిమా మొదలైపోయి, విడుదలైపోయి కూడా ఉండాలి. అయితే మధ్యలో ‘భీమ్లా నాయక్‌’ సినిమా చేయడం వల్ల లేట్‌ అయ్యింది. ‘హరి హర వీరమల్లు’ పూర్తికాకపోవడంతో దాని మీదే పవన్‌ దృష్టి ఉంది.

దీంతో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ ఇక లేనట్లే అంటున్నారు. ఈ విషయం పవన్‌ క్లారిటీగా చెప్పేశాడు అని కూడా టాక్‌. దీంతో ఇప్పుడు మరి పవన్‌ దగ్గర నుండి మైత్రీ వాళ్లు డబ్బులు వసూలు చేస్తారా, లేక వేరే సినిమా చేసేవరకు వెయిట్‌ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. డబ్బుల దగ్గర మైత్రీ టీమ్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మరి పవన్‌ దగ్గర ఆ స్ట్రాంగ్‌నెస్‌ చూపిస్తుందా అనేది చూడాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus