Naga Chaitanya: తండేల్ కోసం చైతన్య పడిన కష్టం తెలిస్తే గ్రేట్ అనాల్సిందే!

నాగచైతన్య (Naga Chaitanya)  సినీ కెరీర్ లో వరుసగా విజయాలు సాధించిన సందర్భాలు తక్కువనే సంగతి తెలిసిందే. నాగచైతన్య వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా తండేల్ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే తండేల్  (Thandel)   సినిమా కోసం నాగచైతన్య పడిన కష్టం మాత్రం మామూలు కష్టం కాదని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన బన్నీవాస్ (Bunny Vasu) షాకింగ్ విషయాలను వెల్లడించారు. తండేల్ సినిమా కోసం నాగచైతన్య లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్న సంగతి తెలిసిందే.

Naga Chaitanya

తండేల్ సినిమా కొరకు నాగచైతన్య తనను తాను తగ్గించుకున్నాడని బన్నీవాస్ అన్నారు. రాజు పాత్రను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని ఒక సామాన్య వ్యక్తిగా మారిపోయాడని చెప్పుకొచ్చారు. అతను అన్నీ వదిలేసుకున్నాడని నేను స్టార్ హీరో కొడుకుని పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాననే ఆలోచనలను వదిలేశాడని బన్నీవాస్ తెలిపారు. తండేల్ సినిమాలో నాగచైతన్య ఏదో సాధించాలనే కసితో కనిపించాడని బన్నీవాస్ పేర్కొన్నారు.

తండేల్ సినిమా బడ్జెట్ 80 కోట్ల రూపాయల కంటే ఎక్కువని వార్తలు వినిపిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారికంగా స్పష్టత లేదు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. తండేల్ సినిమాకు చందూ మొండేటి (Chandoo Mondeti)  దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్య కష్టానికి తగ్గ ప్రతిఫలం తండేల్ తో దక్కుతుందో లేదో చూడాలి. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ ఓటీటీ సంస్థల చేతిలోకి నెమ్మదిగా వెళుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బన్నీవాస్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. తండేల్ సినిమా వచ్చే ఏడాది జనవరిలో థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. తండేల్ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.

గిన్నిస్‌ రికార్డు వెనుక చిరు కష్టం.. ఆయన మాటల్లోనే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus