‘ఆరెంజ్’ రీ రిలీజ్… నిజంగా అండర్రేటెడో కాదో రేపు తేలిపోద్ది..!

  • March 24, 2023 / 06:20 PM IST

పాత సినిమాలను రీ రిలీజ్ చేసి.. దాని ద్వారా వచ్చిన డబ్బుని ట్రస్ట్ లకు వాటికి డొనేట్ చేయడం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం. మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ సినిమా కలెక్ట్ చేసిన డబ్బుతో మహేష్ టీం హార్ట్ సర్జరీలు వంటి వాటికి ఉపయోగించింది. ఇదే బాటలో చాలా మంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో రాంచరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాని రీ రిలీజ్ చేయడానికి నిర్మాత నాగబాబు రెడీ అయ్యారు.

ఈ సినిమా కలెక్ట్ చేసిన డబ్బును జనసేన పార్టీ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని… ‘ఆరెంజ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 25న అలాగే 26న ‘ఆరెంజ్’ థియేటర్లలో ప్రదర్శింపబడనుంది. వాస్తవానికి ‘ఆరెంజ్’ అనేది చరణ్ కెరీర్లో ఓ డిజాస్టర్ సినిమా. ‘మగధీర’ సినిమా తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

నిర్మాత నాగబాబు.. భారీగా నష్టపోయారు. ఆయన సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్లిపోయారు. ఈ సినిమా మిగిల్చిన నష్టాల వల్ల. ఇంకోరకంగా పవన్ కు తన రెండో భార్య రేణు దేశాయ్ తో మనస్పర్థలు రావడానికి కారణం కూడా ఈ సినిమానే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. నాగబాబుని నష్టాల నుండి గట్టెక్కించడం కోసం పవన్ తన ఆస్తిని అమ్మడం రెండు దేశాయ్ కి ఇష్టం లేక పవన్ తో గొడవ పడినట్టు కూడా అప్పట్లో టాక్ నడిచింది.

అలాంటి సినిమాని టీవీల్లో చూసిన ప్రేక్షకులు.. ‘అబ్బో అద్భుతం.. అంతేకాదు ఇంత కాదు’ అంటుంటారు. కానీ పెద్దవాళ్ళు మాత్రం తిట్టిపోస్తుంటారు. ఈ విషయంలో వాళ్ళను తప్పుబట్టడానికి ఏమీ లేదు. ఇది పక్కా క్లాస్ సినిమా.. అందులోనూ యూత్ ఫుల్ మూవీ. ఈ చిత్రం రీ రిలీజ్ కు ఎక్కువ శాతం వాళ్ళతో పాటు జనసైనికులు కూడా వెళ్లే అవకాశం ఉంది. మరి ‘ఆరెంజ్’ పై ఈసారైనా వారి ప్రేమ కలెక్షన్ల రూపంలో కురుస్తుందో లేదో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus