రష్మిక ప్రధాన పాత్రలో హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమా వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మహానటిలో సమంత విజయ దేవరకొండ ట్రాక్ ఎలా ఉందో సీతారామంలో తరుణ్ భాస్కర్ రష్మిక ట్రాక్ అలా ఉందని ట్రైలర్ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రష్మిక ఈ సినిమాతో సక్సెస్ సాధించాల్సి ఉంది.
ఈ మధ్య కాలంలో రష్మిక నటించిన సినిమాలలో ఒకటైన ఆడవాళ్లు మీకు జోహార్లు డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో రష్మిక గోల్డెన్ లెగ్ ఇమేజ్ పోయింది. తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే మాత్రమే రష్మికకు ఈ ఇమేజ్ కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు రష్మిక నటన విషయంలో కూడా పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. హను రాఘవపూడి సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది.
నటన విషయంలో కొంతమంది వ్యక్తం చేస్తున్న విమర్శలకు సైతం రష్మిక చెక్ పెడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రష్మిక సీతారామం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు రష్మిక రేంజ్ పెరుగుతుండగా రష్మిక కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగులో వరుస ఆఫర్లతో రష్మిక బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైన నేపథ్యంలో థియేట్రికల్ కలెక్షన్ల ద్వారా ఈ సినిమా కనీసం 25 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాల్సి ఉంది. ఏడాది పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై హను రాఘవపూడి వర్క్ చేశారని తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది