SS Karthikeya: జక్కన్న కొడుకు దేవర రైట్స్ కొనుగోలు చేయడానికి కారణాలివేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర  (Devara) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలోనే జరుగుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు సితార నిర్మాతల సొంతం కాగా కర్ణాటక హక్కులు మాత్రం రాజమౌళి(S. S. Rajamouli) కొడుకు కార్తికేయ (S. S. Karthikeya) సొంతమయ్యాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి కార్తికేయ కర్ణాటక రాష్ట్రంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. కర్ణాటకలో సైతం తారక్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తారక్ సినిమాలు కర్ణాటక రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సందర్భాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా పక్కాగా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. అయితే ఆ సెంటిమెంట్ ను కార్తికేయ బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర రిజల్ట్ గురించి పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ఉండటం వల్లే ఈ సినిమా హక్కులను ఆయన కొనుగోలు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కార్తికేయ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సైతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ” అతని కోట.. అతని ఎదుగుదల.. అతని విజయం.. ఇదంతా నా తారక్ అన్న ప్రేమ కోసం” అంటూ కార్తికేయ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం, దేవర రిజల్ట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో కార్తికేయ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దేవర సినిమా ఇతర రాష్ట్రాల హక్కులకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

దేవర సినిమా బిజినెస్ దాదాపుగా పూర్తైన నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పై మేకర్స్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారు. దేవర సెకండ్ సింగిల్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. అనిరుధ్ (Anirudh Ravichander) తన మ్యూజిక్ తో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus