ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవే ‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’. రిలీజ్ కి ముందు ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా ‘గుంటూరు కారం’ ఉండేది. ఆ తర్వాత ‘హనుమాన్’ ఉండేది. కానీ ఈ 4 సినిమాలు రిలీజ్ అయ్యాక ‘సైంధవ్’ సినిమాలో డైలాగు మాదిరి లెక్కలు మారాయి. అందరికీ ఫస్ట్ ఆప్షన్ ‘హనుమాన్’ అయ్యింది. అందుకు కారణం ‘గుంటూరు కారం’ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం.
ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప .. ఇంకేమీ లేదు అన్నట్టు మొదటి రోజు టాక్ వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ.. ఇచ్చిన హైప్ కి ఈ సినిమా మ్యాచ్ అవ్వలేదు అనే కామెంట్లు గట్టిగా వినిపించాయి. అయితే సంక్రాంతి సెలవులు, మహేష్ బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ వంటివి ‘గుంటూరు కారం’ ని మరో ‘అజ్ఞాతవాసి’ అవ్వకుండా కాపాడాయి.
ఇప్పటికీ వసూళ్లు బాగానే ఉన్నాయి. సినిమా రూ.140 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టింది. ఈ వీకెండ్ కి రూ.150 కోట్ల మార్క్ ను అధిగమించడం ఖాయం. సో వసూళ్ళ పరంగా ‘గుంటూరు కారం’ మంచి మార్కులే వేయించుకుంది. ఇలాంటి టైంలో కొంచెం ప్రమోషన్ చేసి సినిమాని లేపొచ్చు. కానీ చిత్ర బృందం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. మహేష్ బాబు మొక్కుబడిగా టీంకి సక్సెస్ పార్టీ ఇచ్చాడు. ఇప్పుడు దిల్ రాజు వంతు వచ్చింది.
‘గుంటూరు కారం’ ని నైజాంలో దిల్ రాజే విడుదల చేశారు. రేపు లేదా ఎల్లుండి (Guntur Kaaram) ‘గుంటూరు కారం’ టీంకి అతను పార్టీ ఇవ్వబోతున్నాడు. అయితే ఇలాంటి పార్టీలు సినిమాని బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు కాపాడతాయి. ఇలాంటి టైంలో కొంచెం గట్టిగా ప్రమోట్ చేస్తే ఇంకా మంచి వసూళ్లు వస్తాయి కదా. ఇలా పార్టీలు చేసుకోవడం వల్ల కలిసొచ్చేది ఏంటో ‘గుంటూరు కారం’ టీంకే తెలియాలి.