అల్లు అర్జున్ (Allu Arjun) కి, మెగా ఫ్యామిలీకి దూరం పెరిగింది అనే వాదన కొన్నాళ్లుగా ఎక్కువగా వినిపిస్తుంది. బన్నీ వ్యవహార శైలి కూడా వాటికి తగ్గట్టే ఉండటంతో.. అది నిజమని నమ్మిన వారి సంఖ్య ఎక్కువే. కానీ ఇటీవల సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ అల్లు అర్జున్ కోసం చిక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. కానీ పోలీసులు రావద్దని చెప్పడంతో.. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి స్నేహ రెడ్డికి ధైర్యం చెప్పి వచ్చారు.
Allu Arjun
ఇక మరుసటి రోజు బన్నీ రిలీజ్ అయ్యాక చిరు ఇంటికి వెళ్లి కలిసి రావడం జరిగింది. సో ఈ గొడవ వల్ల అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ మళ్ళీ చేరదీసినట్టు అయ్యింది. మరోపక్క ప్రతి ఏడాది మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు వెళ్లి.. అక్కడి ఫామ్ హౌస్లో సంక్రాంతి పండుగని జరుపుకుని వస్తారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి.
అయితే ఈసారి బన్నీ ఆ వేడుకల్లో కనిపిస్తాడా? అనే డిస్కషన్స్ నడిచాయి. చిరును, నాగబాబుని (Naga Babu) అల్లు అర్జున్ మీట్ అవ్వడం వల్ల… దానికి అడ్డంకి లేదు అని అంతా అనుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్ బెంగళూరు వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారా? అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే..అల్లు అర్జున్ ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చాడు. పోలీసుల అనుమతి లేనిదే.. సిటీ దాటడానికి వీల్లేదు.
అలాంటప్పుడు స్టేట్ దాటి బెంగళూరు వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? అయితే డబ్బున్న వాళ్ళు కాబట్టి.. మేనేజ్ చేయలేనిది అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ అలా మేనేజ్ చేసి వెళ్లినా జనాలు అలాగే అనుకుని విమర్శిస్తారు. మరి బన్నీ ఈ విషయంలో ఏం చేస్తాడో… చూడాలి. ప్రస్తుతానికైతే అతను ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.