‘అఖండ’ ’ (Ahanda) నుండి టాలీవుడ్..కి ఓ సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది. అదేంటంటే.. సినిమా కథ మొత్తం ఓ పాప చుట్టూ తిరగడం.. తద్వారా ఎమోషన్ పండటం.. వంటి ఎలిమెంట్స్ ఉంటే… మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. క్లాస్ సినిమా అయినా సరే.. ఈ టైపు కాన్సెప్ట్ తో వస్తే ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. ‘అఖండ’ తర్వాత వచ్చిన ‘బింబిసార’ (Bimbisara) ‘హాయ్ నాన్న‘ (Hi Nanna) వంటి సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి.
Gopichand
‘సైందవ్’ (Saindhav) పోటీలో ఆడలేదు.. కానీ అందులో కూడా ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యింది. ఏదేమైనా 90 శాతం అది సక్సెస్ ఫార్ములా అనుకోవచ్చు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను గోపీచంద్ (Gopichand) కూడా ఫాలో అయినట్టు స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ (Gopichand ) హీరోగా శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో ‘విశ్వం’ (Viswam) అనే సినిమా రూపొందింది. అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇటీవల ఈ చిత్రం నుండి టీజర్ బయటకు వచ్చింది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆ టీజర్ సాగింది.
దీంతో అది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఏమో అనుకున్నారు అంతా..! కానీ తాజాగా ఈ సినిమా నుండి ఓ లిరికల్ సాంగ్ బయటకి వచ్చింది. ఓ చిన్న పాప గురించి ఆమె తల్లి పాడుతున్న ఎమోషనల్ సాంగ్ అది. ‘చిన్నారి తల్లి’ అంటూ ఆ పాట సాగుతుంది.సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) అందించిన ట్యూన్ కూడా ఆకట్టుకుంది. సో సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయితే.. ‘విశ్వం’ మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి.