Jr NTR: మరో ఛాన్స్ ఇస్తే ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?

కొంతమంది దర్శకులకు ప్రతిభ ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఆ దర్శకుల సినిమాలు పలు సందర్భాల్లో ఫ్లాప్ అవుతుంటాయి. ఒకరిద్దరు దర్శకులు తప్ప ఇండస్ట్రీలోని చాలామంది దర్శకులు కెరీర్ లో ఒక్క ఫ్లాప్ వల్ల అయినా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చినా కొంతమంది దర్శకులు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అయితే తారక్ మళ్లీ రాబోయే రోజుల్లో ఛాన్స్ ఇస్తే ఈ దర్శకులు ప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అశోక్, ఊసరవెల్లి సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాయి. సురేందర్ రెడ్డి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా తారక్ కు సురేందర్ రెడ్డి సరైన సక్సెస్ ఇవ్వలేకపోయారని ఫ్యాన్స్ భావిస్తారు. ఈ దర్శకుడికి రాబోయే రోజుల్లో తారక్ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబోలో కంత్రి, శక్తి సినిమాలు తెరకెక్కాయి.

కంత్రి మూవీ కలెక్షన్ల పరంగా యావరేజ్ గా నిలిస్తే శక్తి మూవీ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబోలో మరో సినిమా వద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో దమ్ము సినిమా తెరకెక్కగా మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చినా క్లైమాక్స్, హీరోయిన్ల ఎంపికలో చేసిన తప్పుల వల్ల ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. బాలయ్యకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను తారక్ తో మరో సినిమాకు పని చేసి తారక్ కు హిట్టివ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తారక్ హరీష్ శంకర్ కాంబో మూవీకి మొదట అనుకున్న కథ ఒకటి కాగా ఆ కథ అదే సమయంలో విడుదలైన రెబల్ సినిమాను పోలి ఉండటంతో కొత్త కథతో రామయ్యా వస్తావయ్యా సినిమాను తెరకెక్కించారు. సెకండాఫ్ రొటీన్ గా ఉండటం, శృతి హాసన్ డ్రెస్ ల విషయంలో చేసిన పొరపాట్లు ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ కు కారణమయ్యాయి.

అయితే తారక్ మరో ఛాన్స్ ఇస్తే మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని హరీష్ శంకర్ భావిస్తున్నారు. హరీష్ తారక్ కాంబో బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ కాంబోలో రభస మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమాపై కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా లేరు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus