సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా మల్లిక్ రామ్ (Mallik Ram) డైరెక్షన్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ మరో 24 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే తెలుగులో సీక్వెల్ గా తెరకెక్కిన సినిమాలలో బాహుబలి2 (Baahubali2), పొలిమేర2 (Maa Oori Polimera 2) లాంటి సినిమాలు మినహా మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. టిల్లు స్క్వేర్ మేకర్స్ మాత్రం ఈ సినిమా సులువుగానే సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని ఫీలవుతున్నారు.
టిల్లు స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాకు బుకింగ్స్ జరగడం గమనార్హం.ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయడం ప్లస్ అవుతోంది. టిల్లు స్క్వేర్ కోసం యూత్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. నైజాంలో సిద్ధు జొన్నలగడ్డ జోరు చూపిస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో ఇంటర్వల్ ట్విస్ట్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.
సిద్ధు జొన్నలగడ్డ మార్కెట్ ఈ సినిమాతో అమాంతం పెరుగుతోందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉంది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో కమర్షియల్ హిట్ సాధించిన సితార నిర్మాతలు టిల్లు స్క్వేర్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి.
ఏప్రిల్ నెల 5వ తేదీ తర్వాత వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో టిల్లు స్క్వేర్ కు హిట్ టాక్ వస్తే ఆ సెలవులను సైతం ఈ సినిమా క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. టిల్లు స్క్వేర్ లో ఎంటర్టైన్మెంట్ కు ఢోకా ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమా హిట్టైతే అనుపమకు మూవీ ఆఫర్లు పెరిగే ఛాన్స్ ఉంది.