Trivikram, Rajamouli: ఆ సినిమాతో త్రివిక్రమ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారా?

  • September 22, 2022 / 01:29 PM IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినీ కెరీర్ లో డైరెక్ట్ చేసిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. సాధారణ కథతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. త్రివిక్రమ్, రాజమౌళి ఒకే సమయంలో దర్శకులుగా కెరీర్ ను మొదలుపెట్టగా రాజమౌళి మాస్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడితే త్రివిక్రమ్ క్లాస్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే ఒక విధంగా ఈ సినిమా హక్కులు భారీ మొత్తానికే అమ్ముడయ్యాయని చెప్పాలి. త్రివిక్రమ్ కూడా జానపద, చారిత్రక కథలపై దృష్టి పెడితే జక్కన్న రికార్డులను బ్రేక్ చేయడం సులువేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మహర్షి తర్వాత మహేష్ పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు పూజా హెగ్డేకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమాతో తాను కోరుకున్న సక్సెస్ కచ్చితంగా దక్కుతుందని పూజా హెగ్డే భావిస్తున్నారు. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

వరుస విజయాలతో జోరుమీదున్న మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. మహేష్ సినిమాతో త్రివిక్రమ్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus