Trivikram: అనౌన్స్మెంట్ ఇస్తే సరిపోయిందా.. ప్రాజెక్టు పట్టలెక్కుతుందా?

కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు 28 వ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 28 వ సినిమా ఉంటుందని.. దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తారని..! అతడు,ఖలేజా వంటి క్లాసిక్స్ ఈ కాంబినేషన్ నుండీ వచ్చాయి కాబట్టి .. అటు ప్రేక్షకులు ఇటు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో కల్ట్ క్లాసిక్ ఈ కాంబినేషన్ నుండీ వస్తుందని వారు భావిస్తున్నారు. అయితే ఇక్కడ వారిని కలవరపరచే అంశం కూడా ఒకటి ఉంది. దీనికి కారణం దర్శకుడు త్రివిక్రమ్.

విషయంలోకి వెళితే.. త్రివిక్రమ్ తన అజ్ఞాతవాసి సినిమాకి ముందు వెంకటేష్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు.హారిక అండ్ హాసిని వారే దానికి నిర్మాతలు అని 2017 లో వెంకటేష్ పుట్టినరోజు నాడు అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. అటు తరువాత ఎన్టీఆర్ తో అరవింద సమేత చేశాడు త్రివిక్రమ్. ఇక గతేడాది అంటే 2020 జనవరిలో ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశారు త్రివిక్రమ్ అండ్ హారిక హాసిని టీం..! కానీ ఆ ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు.

తన తరువాతి సినిమాని కొరటాల తో సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇలా వెంకీ, ఎన్టీఆర్ ల సినిమాలను అనౌన్స్ చేసి మరీ పక్కన పడేశాడు త్రివిక్రమ్. మరి ఇప్పుడు మహేష్ తో తన 3 వ సినిమాని అనౌన్స్ చేశాడు. ఇదైనా సెట్స్ పైకి వెళ్తుందా.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా ఎన్టీఆర్ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు రిలీజ్ టైం అనౌన్స్ చేసినట్టు మహేష్ సినిమా రిలీజ్ టైం ను కూడా ప్రకటించారు. మరి ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి..!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus