సినిమా ఫ్లాప్ అని తెలిసినా సక్సెస్ మీట్ లు పెట్టి కేకులు కట్ చేస్తున్న ఈ తరుణంలో తమ సినిమా ఆడలేదు అని ఒప్పుకొనే స్టార్ హీరోలు కూడా ఉన్నారు మన జనరేషన్ లో. వాళ్ళలో విజయ్ దేవరకొండ ముందు ఉంటాడు. తన “నోటా” సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ పరాజయాన్ని ఒప్పుకోవడమే కాక “అవును నా సినిమా పోయింది” అని పబ్లిక్ గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా “వినయ విధేయ రామ” సినిమా కోసం ఆ పద్ధతిని ఫాలో అయ్యాడు.
అయితే.. ఇప్పుడు భారీ అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడమే కాక ఊహించిన స్థాయి కలెక్షన్స్ సైతం రాబట్టలేక చతికిలపడుతున్న “డియర్ కామ్రేడ్” విషయంలో కూడా విజయ్ ఇంకో లేఖ రాయనున్నాడు అని తెలుస్తోంది. విడుదలైన రెండో రోజే.. “ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ తో నేను ఏకీభవిస్తున్నాను.. ఇదే మేము కూడా ఊహించామ్.. మా కథను ఇలాగే చెప్పాలనుకున్నాం” అని క్లారిటీ ఇచ్చిన విజయ్.. రానున్న రెండు రోజుల్లో “నోటా” తరహాలో “డియర్ కామ్రేడ్” సినిమాకి కూడా ఒక లెటర్ రాసి తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో అప్డేట్ చేయనున్నాడు. మరి ఆ లెటర్ లో మ్యాటర్ ఏముంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.