Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ఆ రికార్డును బ్రేక్ చేయడం సాధ్యమేనా?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సినిమాలలో ఒకటైన వాల్తేరు వీరయ్య 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలలో ఈ సినిమాకే ఎక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఓవర్సీస్ లో సైరా నరసింహారెడ్డి సినిమా క్రియేట్ చేసిన రికార్డును ఈ సినిమా బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మెగా మాస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వాల్తేరు వీరయ్య గురించి ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి మూవీ కూడా భారీగానే కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఈ రెండు సినిమాలతో మైత్రీ నిర్మాతలకు భారీ లాభాలు ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సైరా నరసింహారెడ్డి మూవీ ఫుల్ రన్ లో ఓవర్సీస్ లో 2.6 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడం ఈ సినిమాకు సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఓవర్సీస్ లో రోజురోజుకు ఈ సినిమా కలెక్షన్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. వాల్తేరు వీరయ్య చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. శృతి హాసన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

సంక్రాంతి విజేత వాల్తేరు వీరయ్య అని ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 సంక్రాంతికి కూడా గట్టి పోటీ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus