టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా రవికిషన్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. రవికిషన్ (Ravi Kishan) 2019 సంవత్సరంలో యూపీలోని గోరఖ్ పూర్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే లోక్ సభ ఎన్నికల ముందు ఆయనకు భారీ షాక్ తగిలింది. ఒక మహిళ తాను రవికిషన్ భార్యనే అంటూ మీడియా ముందుకు వచ్చారు. తన కూతురిని రవికిషన్ స్వీకరించాలంటూ ఆ మహిళ కామెంట్లు చేసున్నారు. రవికిషన్ చాలా సంవత్సరాల క్రితమే ప్రీతి కిషన్ అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు రివా కిషన్ అనే కూతురు ఉంది.
రేసుగుర్రం (Race Gurram) సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడు ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువ సినిమాలలో నటించడం లేదు. మరోసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని రవి కిషన్ భావిస్తుండగా అపర్ణా ఠాకూర్ అనే మహిళ తాను రవికిషన్ భార్యనే అంటూ మీడియా ముందుకు వచ్చారు. 1996 సంవత్సరంలో తనకు, రవికిషన్ కు పెళ్లి జరిగిందని పాప కూడా పుట్టిందని అపర్ణ పేర్కొన్నారు. రవికిషన్ ఇప్పటికీ తనతో టచ్ లో ఉన్నాడని ఆమె చెబుతున్నారు.
మహిళ ఆరోపణల వల్ల రవికిషన్ పొలిటికల్ కెరీర్ చిక్కుల్లో పడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అపర్ణ ఠాకూర్ కూతురు మాట్లాడుతూ రవికిషన్ నా తండ్రి అని నాకు 15 ఏళ్లు వచ్చిన తర్వాతే తెలిసిందని చెప్పుకొచ్చారు. గతంలో ఆయనను అంకుల్ అని పిలిచేదానినని అపర్ణ కూతురు వెల్లడించారు. నా ప్రతి పుట్టినరోజుకు రవికిషన్ మా ఇంటికి వచ్చేవారని ఆయన ఫ్యామిలీని నేను కూడా ఒకసారి కలిశానని ఆమె పేర్కొన్నారు.
తండ్రిగా చూస్తే మాత్రం ఆయన నా దగ్గర ఎప్పుడూ లేరని నన్ను కూతురిగా స్వీకరించాలని ఆయనను కోరుతున్నానని కోర్టులో కేసు వేద్దామని అనుకుంటున్నానని అపర్ణ కూతురు అన్నారు. అపర్ణ కూతురు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.