జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ యాదమ్మ రాజు తన కామెడీ డైలాగ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా ఎదిగారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందినటువంటి యాదమ్మ రాజు స్టెల్లా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరూ రీల్స్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఇలా యూట్యూబ్ వీడియోస్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యాదమ్మ రాజు ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.
ఈ ప్రమాదం కారణంగా ఈయన (Yadamma Raju) కాలికిదెబ్బ తగలడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఈయన చికిత్స తీసుకుంటున్నారని తాజాగా చేసిన ఒక ఇంస్టాగ్రామ్ రీల్ ద్వారా తెలుస్తోంది. ఇందులో భాగంగా యాదమ్మ రాజు నడవలేని పరిస్థితిలో ఉండడంతో స్టెల్లా తనని నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యాదమ్మ రాజు కాలికి చిన్న ప్రమాదం జరిగిందని ప్రస్తుతం ఆయన మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారని తెలిపారు.
అయితే తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ స్టెల్లా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది. దీంతో పలువురు యాదమ్మ రాజు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు తన భర్తకు కాలు విరిగినప్పటికీ ఇంస్టాగ్రామ్ వ్యూస్ లైక్స్ కోసం ఇలా ఈ పరిస్థితులలో కూడా రీల్స్ చేయడం అవసరమా అంటూ మరికొందరు స్టెల్లా వ్యవహారంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈయనకు ప్రమాదం జరిగిందనే విషయం తెలియడంతో తాను క్షేమంగా ఉండాలని అభిమానులు ప్రార్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.