Yandamuri, Chiranjeevi: చిరంజీవి గొప్పదనంపై యండమూరి అలా చెప్పారా?

ప్రముఖ రచయితలలో ఒకరైన యండమూరి వీరేంద్రనాథ్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి గారి సినిమాలకు పని చేసే సమయంలోనే తాను బాలకృష్ణ సినిమాలకు కూడా పని చేశానని ఆయన వెల్లడించారు. బాలయ్యతో అశ్వమేధం, రక్తాభిషేకం సినిమాలకు పని చేయగా ఆ రెండు సినిమాలు పెద్దగా విజయం సాధించలేదని యండమూరి వెల్లడించారు.

రచయిత అంటే మెచ్చుకునే వాళ్లు ఎలా ఉంటారో తిట్టేవాళ్లు కూడా అదే విధంగా ఉంటారని యండమూరి అన్నారు. నాకు రచయితలలో ఎవరూ కాంపీటీషన్ లేరని ఆయన వెల్లడించారు. నా పని ఏదో నేను చేసుకుంటానని ఆయన అన్నారు. శత్రువు గురించి ఎక్కువగా ఆలోచిస్తే శత్రువు గెలిచినట్టేనని ఆయన పేర్కొన్నారు. తాను ఎవరి కథలను కాపీ కొట్టలేదని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

నేను ఇతరుల రచనలను నా భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తే ముందుగానే ప్రస్తావిస్తానని ఆయన అన్నారు. కొన్నిసార్లు ఇతరుల ప్రభావం వల్ల రాస్తామని ఆయన చెప్పుకొచ్చారు. డైరెక్షన్ వద్దని డెసిషన్ తీసుకోవడానికి ప్రొడ్యూసర్ లేకపోవడం కారణమని అయన వెల్లడించారు. మృగరాజు సినిమాకు సంబంధించి నేను ఎంటర్ అయ్యే సమయానికి స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని ఆయన అన్నారు.

మృగరాజు రిజల్ట్ తో నాకేం సంబంధం లేదని యండమూరి వెల్లడించారు. మృగరాజు సినిమాకు పని చేసిన సమయంలో కొడుకు పెళ్లికి డబ్బులు అవసరం ఉందని చిరంజీవిని అడగగా 4 లక్షల రూపాయలు ఇప్పించారని యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. ఆ విధంగా చిరంజీవి తనకు సహాయం చేశారని యండమూరి తెలిపారు. చిరంజీవి గొప్పదనం గురించి యండమూరి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరోవైపు చిరంజీవి ఆచార్య సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆచార్య పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ అయితే మాత్రమే ఈ సినిమా నిర్మాతలకు మేలు జరుగుతుంది.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus