అమెజాన్ నుంచి వెళ్లిపోతున్న సినిమాలు!

సినిమాలను ఓటీటీకి అమ్మినప్పుడు దాని హక్కులు శాశ్వతంగా సదరు ఓటీటీకి చెందినవనే అనుకుంటారు. కానీ ఈ ఒప్పందాలకు కాలపరిమితి ఉంటుంది. అది దాటిన తరువాత ఆ ఫ్లాట్ ఫామ్ కి గుడ్ బై చెప్పాల్సిందే. ఒకవేళ కొనసాగించాలంటే మాత్రం తిరిగి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం నిర్మాత అడిగినంత మొత్తాన్ని ఇవ్వాలి. ఒక్కోసారి వీటి ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

వీటిని పదే పదే చూసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వారందరికీ షాక్ ఇస్తూ.. మరో పది రోజుల్లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ నుంచి సెలవు తీసుకోబోతున్నాయి. ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘దిల్ తో పాగల్ హై’, ‘మొహబత్తే’, ‘రబ్ నే బనా ది జోడి’, ‘చక్ దే ఇండియా’, ‘జబ్ తక్ హై జాన్’, ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘ఫనా’, ధూమ్ సిరీస్ ఇలా ఎన్నో సినిమాలు అందులోనే ఉన్నాయి. ఈ సినిమాల కోసం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు.

వారిని నిరాశ పరుస్తూ అక్టోబర్ 1 నుంచి వెళ్లిపోతున్నాయి. ఆ తరువాత హాట్ స్టార్ లో రావొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు. టాలీవుడ్ లో ఇలా పేరు మోసిన బ్యానర్లు తమకు చెందిన కొన్ని క్లాసిక్స్ ను ఓటీటీలకు, శాటిలైట్ ఛానెల్స్ కి ఎక్కువ కాలానికి హక్కులు అమ్మేశారు. ఫ్యూచర్ లో వాటికి కూడా ఎక్స్ పైరీ డేట్ వస్తుంది.

ఇప్పుడు యూట్యూబ్ కూడా పూర్తి కమర్షియల్ రూపం తీసుకుంటుంది. యాడ్స్ లేకుండా కంటెంట్ చూడాలంటే డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోమంటుంది. కొత్త సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇలా కొన్ని ఓల్డ్ క్లాసిక్స్ ఓటీటీల నుంచి షిఫ్ట్ అయితే మాత్రం ఇబ్బందే. మరి ఈ విషయంలో ఓటీటీ సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి!

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Share.