Yash: కేజీఎఫ్3 పై షాకింగ్ అప్డేట్ ఇచ్చిన యశ్?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో కేజీఎఫ్ ఛాప్టర్3 సినిమాపై కూడా ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్3 కూడా ఉంటుందని ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సినిమా క్లైమాక్స్ లో ఇచ్చిన హింట్ ఆధారంగా ఈ సినిమా గురించి వేర్వేరు కథలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. అయితే యశ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో కేజీఎఫ్3 గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

కేజీఎఫ్ ఛాప్టర్2 మూవీలో కొన్ని సీన్లను ఎగ్జిక్యూట్ చేయడం సాధ్యం కాలేదని ఆ సీన్లు కేజీఎఫ్ ఛాప్టర్3 లో ఉంటాయని వెల్లడించారు. కేజీఎఫ్3 సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుందని అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని ఆయన వెల్లడించారు. కేజీఎఫ్3 షూటింగ్ విదేశాలలో కూడా జరగబోతుందని పరోక్షంగా తన కామెంట్ల ద్వారా యశ్ క్లారిటీ ఇచ్చారు. యశ్ అప్డేట్ తో కేజీఎఫ్3 సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

ప్రశాంత్ నీల్ కూడా భవిష్యత్తులో కేజీఎఫ్3 గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఊహించని ట్విస్టులతో ప్రశాంత్ నీల్ మెప్పిస్తూ ఉండటం వల్లే ఆయన సినిమాలు విజయాలను సొంతం చేసుకుంటున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కేజీఎఫ్3 ఉందని తెలియడంతో కొందరు నెటిజన్లు కేజీఎఫ్4 కూడా ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పైనే కేజీఎఫ్3 తెరకెక్కనుందని బోగట్టా. అయితే హీరోయిన్ పాత్ర చనిపోవడంతో కేజీఎఫ్3 లో హీరోయిన్ పాత్ర ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. కేజీఎఫ్3 మూవీలో రాఖీ భాయ్ ని ఇంటర్నేషనల్ ఇష్యూగా చూపించబోతున్నారని బోగట్టా. కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాల సక్సెస్ లో యశ్ పాత్ర కూడా ఎంతో ఉంది. ఈ సినిమాలోని కొన్ని అద్భుతమైన డైలాగ్స్ ను యశ్ రాయడం గమనార్హం. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా అద్భుతమైన విజయాలను అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus