Actress: కోర్టు మెట్లెక్కిన విజయ్ దేవరకొండ బ్యూటీ.. వైరల్ అవుతున్న వీడియో..!

కోలీవుడ్ హీరోయిన్ యషికా ఆనంద్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 2018లో వచ్చిన ‘నోటా’ సినిమాతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఈమె మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఇదిలా ఉండగా.. 2021 జులై 25న ఈమె భయంకరమైన యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. తన స్నేహితులతో కలిసి కారులో నైట్ రైడ్ కు వెళ్లిన ఈమె రోడ్డు ప్రమాదానికి గురైంది.

మమల్లాపుర ఏరియాలోని సులేరికాడు వద్ద (Actress) యాషికా ప్రయాణించిన కారు పెద్ద ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న ఆమె స్నేహితురాలు వల్లిచెట్టి భవాన్ని చనిపోయింది. భవాని సీటు బెల్టు పెట్టుకోకపోవటం వల్లే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు వైద్యులు తెలిపారు. యషికా ఫ్రెండ్స్ లో ఇద్దరు అబ్బాయిలు ఉండగా.. వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. యషికా తలకు పెద్ద గాయమవడంతో కొన్ని రోజుల పాటు ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.

ప్రమాదం జరిగిన టైంలో యాషికా కారు డ్రైవ్ చేస్తూ ఉన్నందున ఆమె పై కేసు నమోదు చేయడం జరిగింది. ‘నేను అతి వేగంగా కారు నడిపాను.. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి యాక్సిడెంట్ జరిగింది’ అంటూ ఆమె ఓపెన్ గానే చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో యషికా చెంగల్పట్టు కోర్టుకు విచారణ నిమిత్తం హాజరైంది.విచారణ అనంతరం జులై 27 కు కేసును వాయిదా వేసింది కోర్టు. కోర్టు వద్ద యషికా ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus