పవన్‌ సినిమా కోసం యువ హీరోయిన్‌ రెడీ.. ఈసారి ఎవరు ఫ్లాట్‌ అవుతారో?

‘వినోదాయ చిత్తాం’ రీమేక్.. చాలా రోజుల నుండి పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్లో కలవరం రేపుతున్న సినిమా. ఆ సినిమా పవన్‌కు సరిపడదు అని కొంతమంది ఫ్యాన్స్‌, పక్కాగా సరిపోతుంది చేయాల్సిందే అని మరికొందరు చర్చించుకున్నారు. ఎవరి మాట విన్నారో లేక వేరే పరిస్థితుల వల్లనో కానీ ఆ సినిమా రీమేక్‌ను పవన్‌ ఓకే చేశారు. బుధవారం ఆ సినిమా స్టార్ట్‌ అయ్యింది కూడా. అయితే అందులో హీరోయిన్‌ ఎవరు అనేది ఇప్పుడు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ క్యారెక్టర్‌కి హీరోయిన్‌ ఉండదు. అయితే మరో ముఖ్య పాత్ర అయిన సాయిధరమ్‌ తేజ్‌ పాత్రకు హీరోయిన్‌ ఉంటుంది. అలా ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే ప్రశ్న పుట్టింది. ఇప్పుడు ఆ పాత్ర కోసం గతంలో అనుకున్న భామ కాకుండా కొత్త సుందరి వచ్చారని సమాచారం. గతంలో ఎవరిని అనుకున్నారు అనేది కాసేపు పక్కనపెట్టి ఇప్పుడు ఎవరు అనేది చూద్దాం. ఒక కన్ను గీటి మొత్తం కుర్ర కారును ఓ కుదుపు కుదిపేసిన సుందరే ఆ హీరోయిన్‌ అని టాక్.

వింక్ గాళ్‌గా ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను ఈ సినిమాకు తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే తెలుగులో ఓ సినిమా చేసింది ప్రియ. ఆ సినిమా ఫలితం తేడా కొట్టేసేసరికి కొత్త అవకాశాలు రాలేదు. అయితే తొలి సినిమా ‘ఒరు అడార్‌ లవ్‌’లో ఉన్నంత క్యూట్‌నెస్‌ నితిన్‌ ‘చెక్‌’ సినిమాలో లేకపోవడమూ ఓ కారణమనే మాటలూ వినిపించాయి. ఇక తేజ సజ్జా సినిమా ‘ఇష్క్‌’లోనూ నటించినా పెద్దగా పేరు రాలేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే..

ఆ సెమీ ఫేడౌట్‌ సుందరినే ఇప్పుడు తీసుకుంటున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్‌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఫాంటసీ కామెడీగా రూపొందనున్న ఈ చిత్రానికి మాతృక దర్శకుడు సముద్రకని దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో ‘రంగ రంగ వైభవంగా’ హీరోయిన్‌ కేతిక శర్మ నటిస్తోందని అప్పట్లో వార్తలొచ్చాయి. మరిప్పడు ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ అంటున్నారు. ఫైనల్‌గా ఎవరవుతారో చూడాలి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus