ఒకప్పుడు బాలీవుడ్ జనాలకు మన సినిమాల్ని రీమేక్ చేయడం అంటే సరదాగా ఉండేది. అయితే అవి రీమేక్ అని పెద్దగా తెలియకుండా జాగ్రత్తపడేవారు అనుకోండి. రీసెంట్ టైమ్స్ వరకు వాళ్ల సినిమాల్నే మనం రీమేక్ చేశాం అని యూట్యూబ్ వీడియోల కింద కామెంట్స్ కనిపించేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంతగా అంటే రీమేక్ సినిమాల ఫలితాలు తేడా కొట్టేస్తున్నా ఇంకా కొనసాగించాలనే చూస్తున్నారు. రీసెంట్‌గా మన సినిమాల్ని బాలీవుడ్‌కి తీసుకెళ్లి విజయం సాధించింది బాలీవుడ్.
Kartik Aaryan
‘కబీర్ సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను బాలీవుడ్‌కి ఇచ్చింది మన సినిమా రీమేకే. అయితే ‘జెర్సీ’తో (Jersey) ఆ ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు. ఇక కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) సంగతి సరేసరి. రీమేక్‌లు విజయాల్ని ఇవ్వకపోయినా ఆయన దండయాత్రలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో తెలుగు రీమేక్‌కి ఆయన రెడీ అయిపోయాడు అని టాక్. నాని (Nani) రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమాను బాలీవుడ్‌లో ‘సాటర్‌డే స్టార్’ అనే పేరుతో రీమేక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట.
మాస్‌ని టార్గెట్ చేసుకుని నాని చేసిన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. అలాంటి ఇమేజ్ కోరుకుంటున్న కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan).. అదే సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఇక్కడో విషయం ఏంటంటే.. ఆ సినిమా హిందీ వెర్షన్ అంటే డబ్బింగ్ వెర్షన్ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
దీని కోసం నెట్‌ఫ్లిక్స్ భారీగా ప్రచారం చేసింది కూడా. ఇలాంటి సమయంలో తీసుకెళ్లడం అంటే సాహసమే అని చెప్పాలి. మరోవైపు ‘షెహజాదా’ (Shehzada) అంటూ ‘అల వైకుంఠపురములో..’ (Ala Vaikunthapurramuloo) సినిమాను కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. మరి ఇప్పుడు రీమేక్ అంటే ఫలితం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో విజయాల వెంట పరిగెత్తకురా అని లారీల వెనుక రాసే కోట్ గుర్తొస్తోంది.