Jr NTR: వైరల్ అవుతున్న తారక్ ఎమోషనల్ పోస్ట్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. టెంపర్ సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ వరకు తారక్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను నిరాశపరచలేదనే సంగతి తెలిసిందే. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమా అంచనాలను అందుకోవాలనే ఆలోచనతో కొరటాల శివ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో పాటు హరికృష్ణ పుట్టినరోజు కూడా అనే సంగతి తెలిసిందే.

హరికృష్ణ పుట్టినరోజు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిని తలచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే” అంటూ తారక్ తండ్రి ఫోటోతో ఉన్న పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తండ్రి 66వ జన్మదినాన్ని స్మరించుకుంటూ తారక్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తారక్ చేసిన ట్వీట్ కు 50,000కు పైగా లైక్స్ వచ్చాయి. హరికృష్ణ 2018 సంవత్సరం ఆగష్టు 29వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హరికృష్ణ బాలనటుడిగా, హీరోగా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య సినిమాలు హరికృష్ణకు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.

జయాపజయాలకు అతీతంగా హరికృష్ణ కెరీర్ ను కొనసాగించారు. హరికృష్ణ కొడుకులైన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తారక్, కళ్యాణ్ రామ్ భవిష్యత్తులో మరిన్ని సక్సెస్ లను అందుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదలయ్యే విధంగా కళ్యాణ్ రామ్, తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus