బాహుబలి తరువాత అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరోగా ప్రభాస్ అవతరించారు.బాహుబలి 2 చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాసిన ప్రభాస్, అత్యంత బ్యాడ్ టాక్ లో కూడా 420కోట్లకు పైగా వసూళ్లు సాహో మూవీతో సాధించారు. ముఖ్యంగా సాహో హిందీ వర్షన్ హిట్ అందుకోవడం విశేషం. సొంత గడ్డపై నష్టాలు మిగిల్చిన ఈ మూవీ బాలీవుడ్ లో భారీ వసూళ్లు అందుకుంది. అలాగే హిందీ జనాలు సాహోపై ప్రసంశలు కురిపించారు. ఇక దేశం మొత్తం పాపులారిటీ ఉన్న హీరోగా ప్రభాస్ అదే స్థాయిలో పారితోషికం పుచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీలో నటిస్తున్న ప్రభాస్, ఈ చిత్రాన్ని తనకు భాగస్వామ్యం ఉన్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయడం జరిగింది. ఐతే ప్రభాస్ తన 21వ చిత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేయనున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కించనున్నారట. 500కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుండగా,ఈ మూవీ కోసం భారీగానే తీసుకుంటున్నారట. ఈ చిత్రం కోసం ప్రభాస్ పారితోషికం ఏకంగా 100 కోట్లు అని తెలుస్తుంది. అంటే బాలీవుడ్ లో కూడా ఏ హీరో 100కోట్ల పారితోషికం తీసుకోవడం లేదు.
అక్కడ కొందరు హీరోలకు వంద కోట్ల మార్కెట్ కూడా లేదు. దీనితో బాలీవుడ్ లో అధికంగా తీసుకుంటున్న సల్మాన్, అక్షయ్ వంటి హీరోలను కూడా ప్రభాస్ మించిపోయినట్లే అని చెప్పాలి. మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మిస్తుండగా, ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. 2022లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.