మెగాస్టార్ చిరంజీవి వయస్సు ప్రస్తుతం 68 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఈ వయస్సులో కూడా చిరంజీవి వరుసగా కమర్షియల్ సినిమాలలో నటిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ ఊహించని స్థాయిలో ఖర్చు చేస్తోంది. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. అయితే చిరంజీవి తర్వాత సినిమాను నిర్మించడానికి ప్రముఖ బ్యానర్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఆఫర్ చేసిందని తెలుస్తోంది.
తెలుగులో ప్రస్తుతం కొంతమంది హీరోలు మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. చిరంజీవి డేట్స్ కోసం ఊహించని స్థాయిలో పోటీ నెలకొనడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. చిరంజీవి కెరీర్ పరంగా అంతకంతకూ బిజీ అవుతున్నారు. చిరంజీవి సినిమాకు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఇస్తే చాలని చాలామంది నిర్మాతలు భావిస్తున్నారు. చిరంజీవి రేంజ్, క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోందని అందువల్లే ఎక్కువమంది నిర్మాతలు చిరంజీవి సినిమాలకు నిర్మాతలుగా ఉండటానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
చిరంజీవి సీనియర్ స్టార్స్ లో రెమ్యునరేషన్ విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం. చిరంజీవి సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలైతే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి వచ్చే ఏడాది విశ్వంభర సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
విశ్వంభర సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. విశ్వంభర సినిమాలో చిరంజీవి 70 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి పాత్రలో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!